'జై లవ కుశ' లో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో మెరవనున్నాడు. జై పాత్ర విలన్ గా మిగతా లవ, కుశ పాత్రలు ఒకటి మంచికి మారుపేరు మరొకటి ఎంటర్టైనర్ పాత్ర అంటూ చెబుతున్నారు. అసలు అదే అని మొదటినుండి ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఇలా కావాలనే 'జై లవ కుశ' చిత్ర బృందం ప్రచారం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. సినిమాపై భారీ అంచనాలు పెంచేందుకే ఇలాంటి ప్రచారంతో ఆకట్టుకుంటున్నారనే టాక్ బయటికి వచ్చింది. ఇప్పటివరకు ఎన్టీఆర్ జై పాత్రని చాలా భయానకంగా... రావణుడికి మరో అవతారంగానే ప్రచారం చేస్తూ వస్తున్నారు.
అయితే ట్రైలర్స్ లో టీజర్స్ లో చూపించేదంతా నిజం కాదంట. అసలు జై పాత్ర 'జై లవ కుశ' లో కామెడీని పండించే పాత్ర అంట. 'జై లవ కుశ'లోని జై పాత్రకు నాటకాలంటే చాలా ఇష్టం అంట. అయితే చిన్నప్పుడే తన అన్నదమ్ముల దగ్గర నుంచి అనుకోని పరిస్థితుల్లో వేరు పడిన జై.... నాటకాల గ్రూప్ లో చేరతాడట. ఇక నాటకాల్లో ఒక సభ్యుడిగా మారిన జై రామాయణంలో రావణుడు పాత్రని పండించడంలో ఆరితేరిపోవడంతో నాటకాల బృందం ప్రతి సారి జై కే ఆ రావణుడి క్యారెక్టర్ ఇస్తో వచ్చేది. అనుకోని సంఘటనలతో జై తన ఇద్దరి అన్మదమ్ముల్ని అంటే లవ, కుశ ని కలుసుకోవడం..... ఒకరి స్థానాల్లోకి మరొకరు వెళ్లి తమకొచ్చిన సమస్యల్ని నుంచి బయటపడటంతో జైలవకుశ కథ నడుస్తుందని ఇన్ సైడ్ టాక్.
అయితే ఇది రివీల్ కాకుండా చిత్ర బృందం జాగ్రత్త పడుతూ ప్రచారంలో జై ని రావణాసురుడిగా చూపిస్తూ.. సెప్టెంబర్ 21 న ప్రేక్షకులు థియేటర్స్ లోకి రాగానే ఒక్కసారిగా నవ్వించాలనే ట్రిక్ ప్లాన్ చేసిందట. మరి చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు జై కేరెక్టర్ నవ్వులు పండిస్తే మరి మిగతా రెండు పాత్రలు కూడా కామెడీతో కూడిన యాక్షన్ చేసేలా కనబడుతున్నాయి. ఇక అంతా క్లారిటీగా తెలియాలి అంటే మరో 10 రోజులు ఎదురు చూడక తప్పదు.