Advertisement
Google Ads BL

కమల్ ఇడియట్ అయితే ఆయన బ్రోకర్..!


దేశంలోనే సంచలన, వివాదాస్పద నేతగా బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి ఉంది. ఆయన చాలా తెలివైన వ్యక్తి. కానీ దానిని ఆయన వక్రమార్గంలో వినియోగిస్తాడనే చెడ్డపేరు కూడా ఉంది. అయినా ఆయన చేసే కొన్ని మంచి పనులు అవినీతిపరులు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తాయి. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియాని, ఆమె కుటుంబాన్ని మూడు చెరువుల నీరు తాగించిన ఆయన జయ, శశికళలపై అలుపులేని పోరు కొనసాగించాడు. చివరకు నేడు సీఎంగా చిన్నమ్మ ఎన్నిక కాకుండా జైలు ఊచలు లెక్కపెట్టడానికి కూడా కారణం ఈయనే. 

Advertisement
CJ Advs

ఇక ఈయన ఆమద్య రాజకీయాలలోకి రావాలని భావిస్తున్న తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి చదువు రాదని, ఆయనకు రాజ్యాంగం కూడా తెలియదని, కాబట్టి రజనీకి రాజకీయాలలోకి వచ్చే ఆలోచనే వద్దని చెబుతూ, రజనీకి చెందిన పలు అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక తాజాగా లోకనాయకుడు కమల్‌హాసన్‌ ఆమద్య రాజకీయాలలోకి వస్తానని ప్రకటించడంతో మరోసారి సుబ్రహ్మణ్యస్వామి లోకనాయకుడిపై పదునైన వ్యాఖ్యలు చేశాడు. 

ఇతరుల కంటే తాను ఎంతో గొప్పవ్యక్తి అని భావించే ఇడియట్‌ కమల్‌హాసన్‌. ఆయన సీపీఎంలో చేరుతున్నట్లు విన్నాను. 'ఇడియట్స్‌ పార్టీలోకి మరో ఇడియట్‌ వెళ్తున్నాడు..' అని తన ట్విట్టర్‌లో సంచలనాత్మక కామెంట్స్‌ చేశాడు. దీంతో కమల్‌హాసన్‌ ఫ్యాన్స్‌ కూడా సుబ్రహ్మణ్యస్వామిపై మండిపడుతున్నారు. 

'ఇతర పార్టీల నుంచి బిజెపిలో చేరిన ఎందరో ఇడియట్స్‌ ఆ పార్టీలో ఉన్నారు. అందరూ సమర్ధత కలిగిన ఇడియట్స్‌. స్టాలిన్‌ని బహిరంగంగా ఆరాధించడం కమల్‌ ఇప్పుడే ప్రారంభించాడు. ఆయన ఇష్టం. ఆయన ఏ పార్టీలో అయినా చేరవచ్చు. మీరెందుకు బాధపడుతున్నారు బ్రోకర్‌స్వామీ? కమల్‌హాసన్‌ పేరెత్తే అర్హత కూడా నీకు లేదు...' అంటూ కమల్‌ ఫ్యాన్స్‌ కూడా ఎదురుదాడికి దిగారు. మొత్తానికి ఈ వ్యవహారం చినికి చినికి గాలివానలా మారి ఎలా తయారవుతుందో వేచిచూడాల్సివుంది...! 

Subramanian Swamy calls Kamal Haasan a pompous idiot:

BJP senior leader Subramanian Swamy took to twitter as always and hit Kamal Haasan with his sharp tweets.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs