Advertisement
Google Ads BL

పటాస్ పంచ్- బిగ్‌బాస్‌ షో కి టైమెక్కడిది!


తెలుగులో ఎన్టీఆర్‌ హోస్ట్‌గా 'బిగ్‌బాస్‌' రియాల్టీ షో ప్రారంభం కానుందని తెలియగానే ఇందులో పార్టిసిపెంట్స్‌గా రేష్మి, అనసూయ, శ్రీముఖి, సుమ వంటి వారు పాల్గొనున్నారని వార్తలు వచ్చాయి. వారితో పాటు పోసాని కృష్ణ మురళి పేరు కూడా బాగా వినిపించింది. అయితే ఈ యాంకర్లు, పోసాని వంటి నటులు సినిమాల షూటింగ్స్‌లో బిజీబిజీగా ఉంటే ఇతర మనం చెప్పుకున్న యాంకర్లు పలు కార్యక్రమాలకు హోస్ట్‌గా చేస్తూ క్షణం తీరికలేకుండా ఉన్నారు. దాంతో వారు 'బిగ్‌బాస్‌' షోలో పాల్గొంటే వచ్చే పబ్లిసిటీ కన్నా తమకు కావాల్సినంత క్రేజ్‌, ఇమేజ్‌ బాగా ఉన్నాయని, కాబట్టి 'బిగ్‌బాస్‌' హౌస్‌లో అన్నిరోజులు గడపడం సమయం వృదా అని, దానివల్ల తమకు షూటింగ్‌లలో పాల్గొనక పోవడం వల్ల... బిగ్‌బాస్‌లో పాల్గొనడం ద్వారా వచ్చే పారితోషికం కన్నా ఎక్కువ నష్టం వస్తుందని భావించారు. 

Advertisement
CJ Advs

నిత్యం టీవీ షోలు, పలు వేడుకలకు హోస్ట్‌గా చేసే సుమతో పాటు పలువురికి వారి బిజీ షెడ్యూల్‌ ఈ షోలో పాల్గొననివ్వకుండా చేసింది. తాజాగా యాంకర్‌ శ్రీముఖి మాట్లాడుతూ, నేను 'పటాస్‌' వంటి షోతో బాగా బిజీగా ఉన్నాను. ఇక బిగ్‌బాస్‌లో పిలుపు వచ్చిన ముందు రోజే మరో టీవీ షోకి కూడా అగ్రిమెంట్‌ చేశాను. నాకు హిందీ బిగ్‌బాస్‌ షో అంటే చాలా ఇష్టం. చూసిన షోలనే మరలా మరలా చూసేదానిని. కానీ బిగ్‌బాస్‌ షోలో పాల్గొనక పోవడానికి బిజీగా ఉండటం ముఖ్యకారణమని చెప్పింది. మరికొందరు బిగ్‌బాస్‌ షో తెలుగువారికి కొత్త. దీనిలో వివాదాలు, ఇతర వివాదాస్పద అంశాలు ఏమైనా ఉంటాయేమోనని కూడా ఇందులో పాల్గొనేందుకు సందేహించారు. కానీ తొలి సీజన్‌ బాగా నడవడంతో రాబోయే సీజన్లలలో మాత్రం పార్టిసిపెంట్స్‌గా బిగ్‌బాస్‌హౌస్‌లోకి ప్రవేశించేందుకు పోటీ తీవ్రంగానే ఉంటుందని చెప్పవచ్చు. 

Sreemukhi About Jr NTR Bigg Boss Show:

Sreemukhi Busy with Paatas show and Other Programmes 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs