Advertisement
Google Ads BL

మహానటి సావిత్రి మళ్లీ వచ్చినట్లే వుంది..!


ప్రస్తుతం మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా 'మహానటి' అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈచిత్రంలో మహానటి సావిత్రిగా కీర్తిసురేష్‌ నటిస్తోంది. సావిత్రి అంటే కాస్త బొద్దుగా, లావుగా ఉండే లావణ్యరూపం మన కళ్లముందు తచ్చాడుతుంది. ఇక ఈ చిత్రం షూటింగ్‌ మొదలైన మొదట్లోనే రెండు జడలు వేసుకుని కనిపిస్తున్న కీర్తిసురేష్‌ సావిత్రికి సంబంధించిన లుక్‌ లీకైంది. ఈ స్టిల్‌లో కీర్తిసురేష్‌ అచ్చు సావిత్రిలా ఎంతో మేకోవర్‌తో ఉంది. అయితే సావిత్రి పాత్ర కోసం కీర్తిసురేష్‌ ఏమైనా బరువు పెరగడం గట్రా ఏమైనా చేసిందా? అనే అనుమానం మాత్రం వస్తోంది. 

Advertisement
CJ Advs

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని పిక్స్‌ రిలీజ్‌ అయ్యాయి. ఇందులో కూడా కీర్తిసురేష్‌ అచ్చు సావిత్రిలాగా బొద్దుగా ఉంది. మరోవైపు ఇందులో జెమినీ గణేషన్‌ పాత్రను మలయాళ నటుడు, 'ఓకే బంగారం' ఫేమ్‌, మమ్ముట్టి తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ పోషిస్తున్నాడు. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన లుక్‌ని చూస్తే దుల్కర్‌ ప్రింటు కొట్టినట్లుగా కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌ జెమినీ గణేషన్‌లా మారిపోయాడు. దీంతో దుల్కర్‌ జెమని లుక్‌కి కూడా విశేష స్పందన లభిస్తోంది. ఈ రెండు లుక్‌లను చూస్తే ఈ బయోపిక్‌ కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కథ విషయంలోనే కాదు.. పాత్రల లుక్‌ల విషయంలో కూడా ఎంతో శ్రద్ద తీసుకుంటున్నాడని అర్ధమైపోతోంది. 

తెలుగు, తమిళం, మలయాళంలో రూపొందుతున్న ఈ 'మహానటి' చిత్రంలో జమునగా 'అర్జున్‌రెడ్డి' ఫేమ్‌ షాలిని పాండే, నిర్మాత చక్రపాణి పాత్రలో ప్రకాష్‌రాజ్‌లతో పాటు కీలకమైన పాత్రల్లో ప్రగ్యాజైస్వాల్‌, సమంత, విజయ్‌దేవరకొండలు నటిస్తున్నారు. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబుతో పాటు నాటి ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ పాత్రలకు కూడా కీలక నటులు నటించే అవకాశం ఉంది. మొత్తానికి ఈ చిత్రం కోసం నాగ్‌ అశ్విన్‌ బాగా కష్టపడుతున్నాడని మాత్రం విడుదలైన పిక్స్‌ చూస్తేనే అర్ధమవుతోంది. 

Keerthi Suresh In Mahanati Saavitri Role:

Mahanati Movie Saavitri role actress Keerthi Suresh Pics Leaked 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs