Advertisement
Google Ads BL

కట్టప్పని అలా చూసేసరికి కోపమొచ్చింది!


'బిగ్‌బాస్‌' షో తెలుగులో మొదలవుతుందని తెలిసిన వెంటనే ఓ వెరైటీ షో చూడనున్నామని తెలుగు ప్రేక్షకులు భావించారు. ఈ షోలో ఎవరెవ్వరు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రవేశిస్తారు? అన్నదానిపై కూడా పలు వార్తలు వచ్చాయి. ఇక ఈ షో వీక్‌డేస్‌లో ఒకస్థాయి టీఆర్పీలు సాధిస్తున్నప్పటికీ వీకెండ్‌లో హోస్ట్‌గా యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కనిపిస్తూ ఉండటంతో మంచి టీఆర్పీలు నమోదవుతున్నాయి. 

Advertisement
CJ Advs

ఇక 'బిగ్‌బాస్‌'షో వీక్షకుల్లో సామాన్య ప్రేక్షకులే కాదు.. పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఈ షో ద్వారా పలువురు తమ సినిమాలను ప్రమోట్‌ చేసుకుంటూ ఉండగా, మరికొందరు బిగ్‌బాస్‌ని ఏదో విధంగా మాటల్లో ముంచెత్తడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. 'బిగ్‌బాస్‌' షోలో వచ్చే టైం లో,  షో మధ్యలో బ్రేక్‌లో వచ్చే విషయాలను సైతం వినోదంగా, అందరిలో ఆసక్తిని కలిగించేలా చెబుతూ వీక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నారు. తాజాగా ఇలాంటి మాస్టర్‌ ప్లాన్‌లో సింగర్‌ అనుదీప్‌ దేవ్‌ కూడా సక్సెస్‌ అయ్యాడు. 

ఆయన ప్రతిరాత్రి బిగ్‌బాస్‌ షో చూస్తున్నాడట. దీంతో ఆయన ఓ సరదాగా సాగే విషయం ఒకదానిని వెల్లడించాడు. బిగ్‌బాస్‌ షో మద్యలో 'కోడి కూర... కోడి కూర కూర్మ.. ' అంటూ ఓ ప్రకటన వస్తుంది. ఆ యాడ్‌లో విగ్గుతో ఉన్న కట్టప్ప సత్యరాజ్‌ని చూడటం ఇరిటేటింగ్‌గా ఉంది.. అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇలా మద్యలో వచ్చే సత్యరాజ్‌ యాడ్‌ని తనదైన సమయస్ఫూర్తితో వాడుకుని ఓ ఇంటరెస్టింగ్‌ ట్వీట్‌ చేయడం ద్వారా కూడా 'బిగ్‌బాస్‌' షోని బాగా వాడుకోవచ్చని అనుదీప్‌దేవ్‌ నిరూపించాడు. 

Kattappa Irritates Singer Anudeep Dev :

Singer Anudeep Dev Tweet on Bahubali Kattappa at Bigg Boss Show Time 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs