Advertisement
Google Ads BL

కోలీవుడ్ హీరో నుండి తేజ కి కాల్...!


దర్శకుడు తేజ కి 'నేనే రాజు నేనే మంత్రి' తో జాక్ పాట్ తగిలినట్టే అంటున్నారు. వరుస అపజయాలతో ఐరెన్ లెగ్ దర్శకుడిగా ముద్ర పడిపోయిన తేజని పిలిచి రానా అవకాశం ఇవ్వడంతో తేజ జాతకం మారిపోయింది. తేజ అంటేనే ఆమడ దూరం పారిపోయే హీరోలు.... ఇప్పుడు తేజ అంటే కొద్దిగా ఆలోచించే స్థితికి వచ్చారు. తేజతో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో చాలామంది హీరోలే ఉన్నట్లుగా కనబడుతున్నారు. అయితే 'నేనే రాజు నేనే మంత్రి' తర్వాత తేజ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇద్దరు మెగా హీరోలతో మల్టీస్టారర్ అంటున్నారు.. అలాగే ఒక యంగ్ హీరోని తేజ దర్శకత్వం చేయబోతున్నట్లుగా చాలానే వార్తలొస్తున్నాయి.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు తేజకి అనుకొని అవకాశం ఒకటి తగిలింది అంటున్నారు. ఒకే ఒక హిట్ తో తేజ కి పట్టిన దరిద్రం వదిలింది అంటున్నారు. ఇక తెలుగులో 'నేనే రాజు నేనే మంత్రి' టేకింగ్ స్టయిల్ కి మెచ్చిన కోలీవుడ్ హీరో కార్తీ, తేజని పిలిచి ఒక అవకాశం ఇచ్చాడనే న్యూస్ కోలీవుడ్, టాలీవుడ్ మీడియాస్ లో కథనాలు వస్తున్నాయి. కార్తీ, తేజని పిలిచి 'నేనే రాజు నేనే మంత్రి'ని ఇప్పుడున్న తమిళ రాజకీయాలకు అనుగుణంగా మార్చి త‌న‌తో సినిమా చేయాల్సిందిగా తేజ‌ను కార్తీ కోరినట్లుగా చెబుతున్నారు. మరి కార్తీ ఆఫర్ ని తేజ ఒప్పుకుంటాడా? లేదా టాలీవుడ్ హీరోలతోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తాడా? అనేది మాత్రం తేజ స్పందిస్తేనే తెలుస్తుంది.

Hero Karthi wants to act in Teja Direction :

Tamil Hero Karthi Open Offer to Nene Raju Nene Mantri Director Teja 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs