ఇటీవల మెగాబ్రదర్ నాగబాబు మహేష్‌బాబు గురించి మాట్లాడుతూ, తాను చెన్నైలో ఉన్నప్పుడు మహేష్ చబ్బీగా ఉండేవాడని, హైదరాబాద్‌కి వచ్చిన మొదట్లో తాము వాకింగ్ చేస్తూ ఉంటే మహేష్ పరుగెత్తుతూ ఉండేవాడని, అలాంటి చబ్బీ బోయ్ నేడు ఎంతో అందంగా మేన్లీగా ఉన్నాడని పొగిడిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా మహేష్‌బాబు తొలిసారిగా స్ట్రెయిట్‌గా కోలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న సందర్భంగా జరిగిన ఆడియో వేడుకలో దర్శకుడు మురుగదాస్ మహేష్ గురించి సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను చెప్పిన తీరు ఎంతో ఆసక్తిని కలిగించింది. ఈ వేడుకకు సంబంధించి ఆహ్వాన పత్రిక అందించేందుకు సూపర్‌స్టార్ రజనీకాంత్ దగ్గరకు వెళ్లిన సమయంలో రజినీ మహేష్ గురించి చేసిన వ్యాఖ్యలు మురుగదాస్ చెప్పిన విశేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
మురుగదాస్ మాట్లాడుతూ, రజినీ సార్‌కి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు ఇన్విటేషన్ కార్డ్‌పై మహేష్‌ని చూసిన రజినీ సార్.. చిన్నప్పుడు చబ్బీగా ఉండేవాడు. ఇప్పుడు స్లైలిష్‌గా, రియల్‌బాండ్‌గా ఉన్నాడు. లుక్ అదిరిపోయింది... అంటూ రజినీ మహేష్ గురించి చాలా మాట్లాడాడట. ఈ విషయాన్ని వేదికపై మురుగదాస్ చెప్పుకుని వచ్చాడు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత కె.ఈ.జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ, నేను, మహేష్, సూర్య, కార్తి, వెంకట్ ప్రభులు ఒకే స్కూల్‌లో చదువుకున్నాం.
మిగిలిన అందరితో చిత్రాలు తీయగలిగానే గానీ మహేష్‌తో తీయలేకపోయాను. ఆ కోరిక ఇప్పుడు తీరింది. 'గజిని'ని మించిన హిట్‌ని 'స్పైడర్' సొంతం చేసుకుంటుంది అని ఆయన తెలిపాడు.