Advertisement
Google Ads BL

ఒకే దెబ్బకు రెండు పిట్టలు..!


మగవారు మద్యం మత్తులో ఉంటే ఆడవారికి ఎన్నో కష్టాలు తప్పవు. సంపాదించినదంతా మందుకు ధారబోసి ఇంట్లో భార్యలకు కట్టుకునేందుకు చీరలు, వండేందుకు బియ్యం, పప్పు, కూరలు ఉన్నాయోలేదో కూడా తెలియని స్థితిలో ఉంటే ఇక ఆ గృహిణి సాధకబాధకాలు ఆ దేవుడికే తెలియాలి. ఇక ఆడవారి వీక్‌నెస్‌ ఏమిటంటే.. ఇంట్లో ఏమి ఉన్నా లేకున్నా తమకున్న చీరల మోజులో గుడ్డలు మాత్రం మంచివి ఉండాలని భావిస్తారు. 

Advertisement
CJ Advs

దానికోసం కేరళలోని కొచ్చిలో మందుకు ఓ వినూత్న ఆఫర్‌ ఇస్తూ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నారు. లోకల్‌ టీవీలలో వస్తున్నప్రకటన అక్కడి ప్రజలందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. షీవాజీ రీగల్‌, విస్కీ బాటిల్‌ ఖరీదు 100 డాలర్ల వరకు ఉంటుంది. అంటే మన కరెన్సీలో దాని విలువ దాదాపు 6,600 రూపాయలు. ఈ బాటిల్‌ని కొంటే ఓ ఖరీదైన చీర ఉచితంగా ఇస్తామని ఆ షాప్‌ వారు ఓ వినూత్న ఆఫర్‌ పెట్టారు. దీంతో ఈ వార్త కేరళ అంతా వైరల్‌ అవుతోంది. మందు బలహీనతతో మగవారి సెంటిమెంట్‌ మీద, ఖరీదైన ఉచిత చీర ద్వారా మహిళల సెంటిమెంట్‌ మీద ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టిన ఘనత ఈ షాప్‌ వారికేదక్కుతుంది. 

అందునా ఈ మందుని కొన్నవారికి ఏదో ఫ్యాషన్‌ చీర కాకుండా కేరళ సంప్రదాయ చీరను అందిస్తుండటం విశేషం. కేరళవారి సంప్రదాయ, ముఖ్యమైన పండుగ అయిన ఓనమ్‌ సీజన్‌లోనే ఈ షాప్‌ వారు ప్రజల వీక్‌నెస్‌ పై దెబ్బకొట్టారు. లిక్కర్‌ ఫారిన్‌ది అయితే చీర మాత్రం కేరళ సంప్రదాయ చీర అంటూ మందుబాబులు ఉత్సాహంగా భార్యా మణులు చీరల కోసం ఆ షాప్‌ ముందు క్యూ కడుతున్నారు. అదీ సంగతి...!

Kerala State in Kochi Wine Shop A Innovative Offered:

Shivaji Regal, whiskey bottle cost up to 100 dollars. That means, in our currency, its value is about 6,600 rupees. The shop offered an innovative offer to buy a bottle offered castly sarees.  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs