Advertisement
Google Ads BL

రోజుకో వార్తతో 'సాహో'హల్‌ చల్‌..!


'బాహుబలి' చిత్రం తర్వాత ప్రభాస్‌ నేషనల్‌ వైడ్‌ స్టార్‌గా మారిపోయాడు. ఈ చిత్రం తర్వాత ఆయన తమ యువిక్రియేషన్స్‌ బేనర్‌లోనే వంశీ, ప్రమోద్‌లు నిర్మాతలుగా 'రన్‌ రాజా రన్‌' ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో ఏకంగా 150కోట్ల భారీ బడ్జెట్‌తో 'సాహో' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం కోసం బాలీవుడ్‌కి చెందిన నీల్‌ నితిన్‌, జాకీష్రాఫ్‌, చుంకీ పాండేలతో పాటు శ్రద్దాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

Advertisement
CJ Advs

ఈ చిత్రం పక్కాయాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందనుందని, ఇదో యాక్షన్‌ ప్యాక్‌డ్‌ మూవీగా ప్రభాస్‌ ఇప్పటికే 'సాహో'ని కన్‌ఫర్మ్‌ చేశాడు. శంకర్‌ -ఎహసన్‌-లాయ్‌తో పాటు ఈ చిత్రంలో బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. యాక్షన్‌ సీన్స్‌ కోసం హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్స్‌ని తీసుకొస్తున్నారు. ఇక ఈ చిత్రం గురించి రోజుకో వార్త హల్‌చల్‌ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో హీరోయిన్‌ శ్రద్దాకపూర్‌ కేవలం గ్లామర్‌కి, పాటలకే పరిమితం కావడం లేదు. 

ఇందులో రెండు కీలక పాత్రల్లో ఆమె ద్విపాత్రాభినయం చేయనుంది. అందులో ఓ పాత్ర అచ్చమైన తెలుగు అమ్మాయిగా, అమాయకమైన పాత్రలో కనిపించనుండగా, మరో పాత్రలో ఆమె రఫ్‌ అండ్‌ టఫ్‌గా ఉండే పాత్రలో నటించనుంది. ఈ పాత్రకు సినిమాలో యాక్షన్‌ సీన్స్‌ కూడా ఉంటాయని సమాచారం. మొత్తానికి ఇందులో శ్రద్దాకపూర్‌కి కీలక పాత్ర రావడంతో ఆమె తన గ్లామర్‌తో పాటు యాక్షన్‌ పార్ట్‌ ద్వారా కూడా అన్ని వుడ్‌ల ఆడియన్స్‌ని ఎలా ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సివుంది..! 

Prabhas 'Saaho' Movie Latest Update!:

Young Rebal star Prabhas and Shraddha kapoor starring movie 'Saaho' new update.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs