Advertisement
Google Ads BL

అదరహో.... 112 కోట్లకు పైగా జరిగింది!


హ్యాట్రిక్ హిట్స్ తో ఎన్టీఆర్ యమా జోరు మీదున్నాడు. 'టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌' సినిమాల హిట్స్ తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో 'జై లవ కుశ' చేస్తున్నాడు. మూడు హిట్స్ తో తన రేంజ్ ఒక్కసారిగా పెంచుకున్న ఎన్టీఆర్ అదే టైం లో తన మార్కెట్ ని కూడా పెంచుకున్నాడు. ఆ క్రేజ్ తోనే ఇప్పుడు కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కిన 'జై లవ కుశ' ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో కాదు.... తారక్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటున్నారు. మాస్ కి మాస్... క్లాస్ కి క్లాస్... కామెడీకి కామెడీ ఇలా అన్ని విషయాల్లో ఈ 'జై లవ కుశ' మీద పిచ్చ క్రేజ్ ఏర్పడడమే కాదు సినిమా మరిన్ని అంచనాలు పెంచేసింది.

Advertisement
CJ Advs

ఇక 'జై లవ కుశ' రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 67.5 కోట్లు బిజినెస్ చెయ్యడం అనేది చూస్తేనే 'జై లవ కుశ' పై ఎన్ని అంచనాలున్నాయో అర్ధమవుతుంది. నైజాం ఏరియాకు ఏకంగా ‘జై లవ కుశ’ 21.2 కోట్లకు అమ్ముడైంది. అలాగే సీడెడ్ రైట్స్ 12.6 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక  వైజాగ్ లో 'జై లవ కుశ' హక్కులు విషయంలో కొంచెం అటు ఇటు జరిగినా ఫైనల్ గా అక్కడ 'జై లవ కుశ' హక్కులు 8 కోట్లు పలికాయి. ఇక ఆంధ్రాలో మిగతా అన్ని ఏరియాలూ కలిపి 26 కోట్లు తెచ్చిపెట్టాయి. ఇక పొరుగు రాష్ట్రం కర్ణాటక హక్కులు 8.2 కోట్లకు.. ఓవర్సీస్ రైట్స్ 8.5 కోట్లకు అమ్ముడయ్యాయి.

అలాగే 'జై లవ కుశ' ఏరియాల థియేట్రికల్ రైట్స్ కూడా ఇంకో 2 కోట్లు తెచ్చాయి. ఎన్టీఆర్ కెరీర్ లోనే అధికమొత్తంలో ఈ 'జై లవ కుశ'కు శాటిలైట్ హక్కుల ద్వారా 14.6 కోట్లు రాబట్టగా... తాజాగా 'జై లవ కుశ' హిందీ డబ్బింగ్ హక్కుల ద్వారా 11 కోట్లు రాబట్టింది. ఇక ఆడియో హక్కుల ద్వారా ఒక కోటి రూపాయలు రాబట్టిన 'జై లవ కుశ' మొత్తం వరల్డ్ వైడ్ గా 112 కోట్లకు పైగా బిజినెస్ చేసి అదరహో అంటూనే ఎన్టీఆర్ కున్న రేంజ్, క్రేజ్ ని గుర్తు చేసింది.

Jai Lava Kusa Movie Pre Release Business:

Young Tiger NTR's Jai Lava Kusa has done a pre release business of Rs.112 crores world wide. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs