Advertisement
Google Ads BL

స్టార్ హీరో.. మాజీ భార్య ఆఖరికి ఇలా.....!


టాలీవుడ్ లో ఇప్పుడు రియాలిటీ షోస్ కి ఛానల్స్ డిమాండ్ బాగా పెరిగింది. కొన్ని ఛానల్స్  ఈ షోలతో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. టీఆర్పీ రేటింగ్లో వారానికో ఛానల్ పై చెయ్యి సాధిస్తూ నెంబర్ 1  పొజిషన్ గేమ్ ని ఆడుతున్నాయి. ఒక్కో ఛానల్ లో ఒక్కో షో విపరీతంగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ టీవీ లో ఢీ సీరీస్, జబర్దస్త్ లు దూసుకుపోతుంటే... స్టార్ మా ఛానల్లో ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో సూపర్ సక్సెస్ అయ్యింది. అలాగే జెమిని ఛానల్ లో రానా హోస్ట్ చేస్తున్న నెంబర్ 1  యారి రియాలిటీ షో కూడా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. 

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు వీరికి ధీటుగా టాలీవుడ్ టాప్ స్టార్ మాజీ భార్య కూడా ఒక రియాలిటీ షోకి జడ్జ్ చెయ్యబోతుందట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య.... మాజీ హీరోయిన్ అయిన రేణు దేశాయ్ కూడా ఇప్పుడు బుల్లి తెర మీద ఎంట్రీ ఇవ్వబోతుందట.  స్టార్ మా ఛానల్ నిర్వహించబోయే బిగ్ డాన్స్ షో కి రేణు దేశాయ్ హోస్ట్ గా వ్యవహరించ బోతుందట. రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ కి విడాకులు ఇచ్చేశాక పూణే లో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుంది. అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చిపోతున్న ఈ హీరోయిన్ ఇప్పుడు స్టార్ మా లో రాబోయే డాన్స్ షోకి జడ్జ్ అవతారమెత్తుతుందట.

పవన్ తో పెళ్ళికి ముందు కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసిన రేణు.... పెళ్లి తర్వాత సైలెంట్ గా కుటుంబానికే పరిమితమైంది. ఆతర్వాత పవన్ తో విడాకులు... కొన్ని వివాదాలతో ఎప్పుడూ మీడియాలో నానుతూ ఉండే రేణు ఇప్పుడు ఇలా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర కాబోతుంది. ఇక స్టార్ మా లో రాబోయే ఈ షో ఇప్పటికే హిందీలో నాచ్ బయెలీ పేరుతో సక్సెస్ అయ్యింది. అక్కడ హిందీలో ఈ డాన్స్ షోకి మాధురి దీక్షిత్ జడ్జిగా ఉన్నారు. తెలుగులో మాధురి దీక్షిత్ ప్లేస్ కి  రేణు దేశాయ్ ని ఎంపిక చేశారు స్టార్ మా యాజమాన్యం.

Pawan Kalyan's Ex-Wife Renu Desai Doing Hosted:

Pawan Kalyan's Ex-Wife Renu Desai Doing Hosted in Star Maa channel for Realty dance show.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs