Advertisement
Google Ads BL

సమంత ట్విట్ కి భలే కౌంటరేశాడు..!


సమంత త్వరలో అక్కినేని వారి ఇంట కోడలిగా అడుగుపెట్టనుంది. మరో నెలలో పెళ్లి చేసుకుని కోడలుగా, భార్యగా బాధ్యతలు తీసుకోబోతున్న సమంత మాత్రం తన అల్లరిని వదలడం లేదు. తాను సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూనే పలువురిని ఆట పట్టిస్తోంది. ఇక విషయానికి వస్తే తాజాగా కమెడియన్‌ వెన్నెల కిషోర్‌ ఫన్నీ ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఇందులో వెన్నెల కిషోర్‌ ఫేస్‌ప్యాక్‌ చేయించుకుని, కన్నుబొమ్మలు పైకి ఎత్తి ఎంతో ఫన్నీగా ఉన్నాడు. మొదట అడవి శేషు తన ట్విట్టర్‌లో నటుడు రాహుల్‌ రవీంద్రన్‌, వెన్నెల కిషోర్‌తో తీయించుకున్న ఫోటోని పోస్ట్‌ చేశాడు. 'బ్యూటీ క్వీన్‌తో నేను, రాహుల్‌ రవీంద్రన్‌' అని సరదాగా ట్వీట్‌ చేశాడు. దీనికి స్పందించిన రాహుల్‌ 'తన భార్య చిన్మయి వేసిన బ్యూటీప్యాక్‌ తర్వాత వెన్నెల కిషోర్‌ ఎంతో అందంగా తయారవుతాడని చెప్పగలను, టౌన్‌లోకి కొత్త అబ్బాయ్‌ రానున్నాడు జాగ్రత్త' అని ట్వీట్‌ చేశాడు. 

Advertisement
CJ Advs

దీంతో వెన్నెలకిషోర్‌ 'చందమామ వంటి అందమైన ముఖం' అనే అర్ధం వచ్చే హిందీ పాటను ట్విట్టర్‌లో రాశాడు. చిన్మయికి థ్యాంక్స్‌ చెప్పాడు. దీంతో పాటు సెల్ఫీని కూడా పోస్ట్‌ చేశాడు. దానికి సమంత స్పందిస్తూ 'ఎంతో అందంగా ఉన్నావ్‌.. కనుబొమ్మలు సరిచేశావా? కొద్దిగా లిప్‌స్టిక్‌ కూడా రాసినట్లున్నావు..' అంటూ సరదగా ఆటపట్టించింది. దీనికి వెన్నెలకిషోర్‌ 'అక్టోబర్‌కి సిద్దమవుతున్నాను సమంత' అంటూ సమాధానం ఇచ్చాడు. మొత్తానికి ఈ నలుగురి ట్వీట్స్‌ సంభాషణలు ఎంతో సరదాగా సాగింది. ఇందులో సమంత ఆటపట్టించే ధోరణిని చూసి అందరూ నవ్వుకున్నారు. కొన్నాళ్ల కిందట కూడా వెన్నెలకిషోర్‌ మట్టి తొక్కుతున్న ఫొటోని విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో పోస్ట్‌ చేసి 'డౌన్‌ టు ఎర్త్‌ అని డైరెక్టర్‌ అంటే ఏదో అనుకున్నా.. చివరకు అది ఇది అని తెలిసింది....' అని చేసిన ట్వీట్‌ కూడా ఎంతో సరదాని సృష్టించిన సంగతి తెలిసిందే. 

Vennela Kishore Counter Tweet on Samantha Tweet:

Vennela Kishore, Rahul Ravindran, Adivi Sesh and Samantha Twitter Hasyam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs