Advertisement
Google Ads BL

ఇంక జాగ్రత్తగా వుండు: ఎన్టీఆర్ క్లాస్..!


కళ్యాణ్ రామ్ తానే హీరోగా.. తానే నిర్మాతగా ఎన్టీఆర్ బ్యానర్ లో చాలా సినిమాలే చేశాడు. కళ్యాణ్ రామ్ తన సినిమాలన్నీ దాదాపు తన సొంత బ్యానర్ లో చేసినవే. ఆయనే హీరో, ఆయనే నిర్మాతగా తెరకెక్కిన సినిమాల్లో పెట్టినదానికన్నా ఎక్కువగా డబ్బు పోగొట్టుకున్నాడు. అలాగే ఇతర హీరోలతో కళ్యాణ్ నిర్మాతగా తెరకెక్కించిన సినిమాలు కూడా నష్టాలూ తెచ్చిపెట్టాయి. అయితే ఇప్పుడు తమ్ముడు ఎన్టీఆర్ సలహాతో కళ్యాణ్ రామ్ లో  మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతుందనేది లేటెస్ట్ న్యూస్. ఎందుకంటే కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఇతరుల నిర్మాతలుగా తాను హీరోగా రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. మరో పక్క తనకు వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి తన తమ్ముడు ఎన్టీఆర్ కున్న క్రేజ్ ని ఉపయోగించుకోవడానికి తహతహలాడుతూ 'జై లవ కుశ' ని నిర్మిస్తున్నాడు.

Advertisement
CJ Advs

ఇకపోతే కళ్యాణ్ రామ్ ఆర్ధికంగా ఎంత బలంగా ఉన్న సినిమాల వలన బాగా నష్టపోయాడన్నది అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. ఇక ఇప్పుడు తమ్ముడు సినిమాతో మంచి లాభాలు గడించే ఛాన్స్ ఉందనే టాక్ బాగా వుంది. దాదాపు 30  నుండి 40  కోట్లు వెనకేసే ఛాన్స్ ఉందంటున్నారు. సినిమాకి మహా పెడితే 60 నుండి 70  కోట్ల పెట్టుబడి పెట్టుంటాడు. మరి 'జై లవ కుశ'కు 100  కోట్ల పైగానే బిజినెస్ జరిగినట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ లెక్కన కళ్యాణ్ రామ్ భారీగా వెనకేసుకునే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు కళ్యాణ్ రామ్ బయట నిర్మాతలకు సినిమాలు చేస్తున్నాడు. కానీ కళ్యాణ్ రామ్ బ్యానర్ లో మాత్రం మంచి కథ, మంచి హీరో, మంచి డైరెక్టర్ ఇలా అన్ని సెట్ అయితేనే హోమ్ బ్యానర్ లో సినిమా తీసే అవకాశం ఉందంటున్నారు.

అయితే ఇలా కళ్యాణ్ రామ్ డెసిషన్ తీసుకోవడానికి తన తమ్ముడు తారక్ కారణమంటున్నారు. ఎన్టీఆర్  తన అన్నగారికి... ఇన్నాళ్లు పోగొట్టుకున్నది ఇప్పుడు 'జై లవ కుశ'తో కవర్ అయ్యింది కాబట్టి ఇక.... ఏదో డబ్బుంది కదా అని ఎడా పెడా సినిమాలు చేసి డబ్బు పోగొట్టుకోకుండా కథ, హీరో, దర్శకుడు నచ్చితేనే సినిమా చేస్తే బావుంటుందని సలహా ఇచ్చినట్లుగా ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఎన్టీఆర్ సలహా మేరకు కళ్యాణ్ కూడా ఇక మీదట జాగ్రత్త పడతాననే మాట ఇచ్చినట్టుగా కూడా టాక్.

Jr NTR Class to Kalyan Ram on NTR ARTS Movies:

Jr NTR Suggestions to Brother Kalyan Ram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs