Advertisement
Google Ads BL

అంజలి జోడి ఎవరో తెలుసా..?


అంజలిని తెలుగమ్మాయి అంటారు గాని ఆ అమ్మాయికి ఇక్కడ టాలీవుడ్ లో మాత్రం పెద్దగా అవకాశాలే లేవు. అందుకే పొరుగు రాష్ట్రం తమిళనాడులో సెటిల్ అయ్యి అక్కడే అవకాశాలు ఎతుక్కుంటుంది. తెలుగులో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి హిట్ సినిమాలో నటించడమేకాదు... లేడి ఓరియెంటెడ్ గా వచ్చిన 'గీతాంజలి'లో కూడా మెప్పించింది. అయితే సీతమ్మకి... గీతాంజలికీ మధ్యలో కొన్ని సినిమాల ఆఫర్స్ వచ్చినా అంజలి పర్సనల్ లైఫ్ లో జరిగిన గొడవల వలన అవకాశాలు కోల్పోయింది. ఇక తెలుగులో కన్నా తమిళ సినిమాలపైనే ఫోకస్ పెట్టిన అంజలి ఇప్పుడు కోలీవుడ్ లో కాస్త బిజీ గానే కనబడుతుంది.

Advertisement
CJ Advs

ఇప్పుడు కోలీవుడ్ హీరో జై తో ప్రేమలో కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జై తో ప్రేమాయణం సాగిస్తున్న అంజలి త్వరలోనే జై ని వివాహమాడబోతుందని అంటున్నారు. ఇకపోతే అంజలి తాజాగా 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోనీతో జోడి కట్టబోతుందనే న్యూస్ కోలీవుడ్ మీడియాలో హైలెట్ అయ్యింది. కృతికా ఉదయనిధి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాళి’ సినిమాలో అంజలికి అవకాశం వచ్చిందట. ఇక ఈ 'కాళీ' సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా  తెరకెక్కబోతుంది చెబుతున్నారు. ఈ ‘కాళి’ సినిమాలో విజయ్ ఆంటోని కి జోడిగా అంజలిని ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. ఇంకా ఈ సినిమాలో అంజలితో పాటు సునైన, అమృత, శిల్పా మంజూనాథ్ నటిస్తున్నారు.

మరి 'బిచ్చగాడు'తో హిట్ కొట్టిన విజయ్ ఆంటోనికి మళ్ళీ హిట్ అనేదే లేదు. ఇక అంజలి కెరీర్ కూడా అంతంత మాత్రంగా వున్న టైంలో విజయ్ - అంజలిలు కలయికలో తెరకెక్కుతున్న ఈ 'కాళీ' సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూద్దాం.

Anjali pairs up with Vijay Antony:

Anjali in Vijay Antony and Kiruthiga Udhayanidhi film Kaali
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs