నందమూరి బాలకృష్ణ - పూరి జగన్నాధ్ కలయికలో తెరకెక్కిన 'పైసా వసూల్' చిత్రం గత శుక్రవామే విడుదలైంది. ఈ సినిమా విడుదలైన మొదటి ఆటకే మిశ్రమ స్పందన తెచ్చుకోవడం... రెండో ఆటకే ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద చతికిల పడింది. 'పైసా వసూల్' లో బాలకృష్ణ గెటప్ తప్ప మరేమి గొప్పగా లేవని.... అసలు సినిమాని పూరి ఏ బేస్ మీద తెరకెక్కించాడని... కథ లేకుండా సినిమా ఎలా ఆడుతుందని... అబ్బో ఒకటేమిటి చాలానే అన్నారు. కేవలం విడుదలరోజు మాత్రమే 'పైసా వసూల్' సత్తా చాటింది. కానీ రెండో రోజు నుండే ఈ సినిమా కలెక్షన్స్ దాదాపు పడిపోయాయి.
'పైసా వసూల్' తో నిర్మాతలు సేఫ్ అయినప్పటికీ బయ్యర్లు రోడ్డున పడే పరిస్థితి వచ్చేటట్టు ఉందని... రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో వార్తలొస్తూనే ఉన్నాయి. ఇక ఈ సినిమా విడుదలై ఒక వారం పూర్తయింది. మొదటి వారంలో 'పైసా వసూల్' 17.77 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇక ఏరియాల వారీగా బాలయ్య ఫస్ట్ వారం వసూలు చేసిన పైసలివే!.
ఏరియా >
మొదటివారం షేర్ (కోట్లలో)----------------- ----------------------------------------------
నైజాం > 3.80
సీడెడ్ > 4.01
నెల్లూరు > 0.69
కృష్ణ > 1.09
గుంటూరు > 2.06
వైజాగ్ > 1.58
తూర్పు గోదావరి > 1.20
పశ్చిమ గోదావరి > 0.94
మొదటివారం ఏపీ మరియు టీఎస్ షేర్ 15.37
కర్ణాటక > 1.40
యుఎస్ఏ > 0.45
ఇతర ఏరియాలు > 0.55
మొదటివారం వరల్డ్ వైడ్ షేర్ > 17.77