Advertisement
Google Ads BL

సెప్టెంబర్‌ 29న పైసా వసూల్ వస్తే పరిస్థితేంటి!


తెలుగు ప్రేక్షకుల్లో నందమూరి నటసింహం బాలకృష్ణకి, దర్శకుడు పూరీ జగన్నాథ్‌కి విపరీతమైన మాస్‌ ఫాలోయింగ్‌ ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో పైసా వసూల్  చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌ 1వ తేదీన విడుదలైంది. దీనికి నెగటివ్‌ టాక్‌ వచ్చింది. ఈ చిత్రం థియేటికల్‌ రైట్స్‌ దాదాపు 34 కోట్లకు అమ్ముడుపోయాయి. కానీ ఇప్పటివరకు ఈ చిత్రం మొదటివారంతానికి వరల్డ్ వైడ్ గా 17.77 కోట్ల షేర్ సాధించింది. 

Advertisement
CJ Advs

ఇక మాస్‌ చిత్రాలను ఏమాత్రం ఆదరించని ఓవర్‌సీస్‌లో ఈ చిత్రం 45లక్షలు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. మొత్తంగా చూసుకుంటే పెట్టిన పెట్టుబడిలో సగం మాత్రమే ఈ చిత్రానికి వచ్చాయి. మరో వారం పాటు మాత్రమే ఈ చిత్రం థియేటర్లలో ఉండే పరిస్థితి ఉంది. ఈ ఫుల్‌రన్‌లో కూడా ఈ చిత్రం కేవలం 20కోట్ల పైసా వసూల్‌ని మాత్రమే సాధించే అవకాశం ఉంది. దీంతో ఈచిత్రాన్ని కొన్నవారికి సగానికి సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ చిత్రాన్ని నిర్మించిన భవ్యఆర్ట్స్‌ అధినేత ఆనంద్‌ప్రసాద్‌ దీని ముందు నిర్మించిన మల్టీహీరోల చిత్రం 'శమంతకమణి' కూడా నష్టాలనే మిగిల్చింది. దీంతో 'పైసా వసూల్‌' చిత్రమైనా తమను గట్టెక్కిస్తుందని నిర్మాత భావించాడు. 

ఇక ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఈ చిత్రం ప్రారంభోత్సవం రోజున సినిమాను సెప్టెంబర్‌ 29న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ దసరా రేసులో ఎన్టీఆర్‌ 'జై లవకుశ' సెప్టెంబర్‌ 21, మహేష్‌బాబు 'స్పైడర్‌' చిత్రం సెప్టెంబర్‌ 27న విడుదల కానుండటంతో ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి ముందుగా విడుదల చేశారు. ఇప్పుడైతే కనీసం ఓపెనింగ్స్‌ అయినా వచ్చాయని, అదే ముందుగా అనుకున్నట్లు సెప్టెంబర్‌ 29న విడుదలై ఉంటే ఓపెనింగ్స్‌ కూడా వచ్చేవి కాదని ట్రేడ్‌ విశ్లేషకులు అంటున్నారు. 

Paisa Vasool Movie Present Status :

Paisa Vasool Flop at Box Office 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs