'జయం'తో పరిచయమై, 'అపరిచితుడు'తో ఫేమస్ అయిన భామ సదా. 'అపరిచితుడు'లో ఏ ముహూర్తాన నటించిందో గానీ ఆతర్వాత ఈ అమ్మడికి చాన్స్‌లు లేవు. ఏదో టీవీ డ్యాన్స్ షోలలో జడ్జిగా మాత్రమే కనిపిస్తోంది. ఇక బాలీవుడ్ సంగతేమోగానీ దక్షిణాదిలో మాత్రం సినిమాలో వేశ్యపాత్ర పోషించడం అంటే అది కెరీర్‌కు చరమాంకమనే చెప్పాలి. ఇప్పుడు అదే పాత్ర సదాని వెత్తుకుంటూ రావడం విశేషం.
తెలుగు, తమిళ రెండు భాషల్లో గుర్తింపు ఉన్న ఈ భామకి గత కొంతకాలంగా సినిమాలు లేక ఖాళీగా ఉంటోంది. ఈ నేపద్యంలో ఆమె 'టార్చ్‌లైట్' అనే చిత్రం చేయడానికి అంగీకరించింది. ఈ సినిమాలో ఆమె వేశ్యపాత్రలో కనిపించనుంది. అందమైన కలలతో.. ఆశలతో...ఆశయాలతో ఉన్న అమ్మాయి...ఏ పరిస్థితుల్లో వేశ్యగా మారవలసి వచ్చిందనే నేపద్యంతో ఈ చిత్రం రూపొందనుంది.
ఈ సందర్భంగా సదా మాట్లాడుతూ, దర్శకుడు అబ్దుల్‌మజీద్ తన వద్దకు వచ్చి, ఓ వేశ్య చుట్టూ తిరిగే కథ అని చెప్పినప్పుడు చేయకూడదని అనుకున్నానని, కానీ ఆ తర్వాత ఆయన కథ చెబుతుంటే కళ్ల వెంబడి కన్నీళ్లు వచ్చాయని అంటోంది. అందుకే ఈ సినిమాను ఒప్పుకున్నానని ఆమె చెప్పింది. చాలా మంది కథానాయికలు ఒప్పుకోని ఈ పాత్ర సదాకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచిచూడాల్సివుంది...! ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తిరునల్వేలి పరిసర ప్రాంతాలలో జరుగుతోంది.