Advertisement
Google Ads BL

బాబాయ్ ముందు 'బిగ్‌బాస్‌' ఆటలు సాగలే!


ఎన్టీఆర్ బుల్లితెర మీద బిగ్ బాస్ కి హోస్ట్ గా ఇరగదీస్తున్నాడు. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నప్పటి నుండి టీఆర్పీ రేటింగ్స్ లో స్టార్ మా ఛానల్ ఫస్ట్ పొజిషన్ కి వెళ్ళిపోయింది. అప్పటినుండి దాదాపు ఐదారు వారాలపాటు స్టార్ మా నే మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది. అయితే స్టార్ మాలో కన్నా ముందే జెమిని ఛానల్ లో రానా హోస్ట్ గా నెంబర్ 1 యారి షో కూడా మొదలైంది. మొదటినుండి రానా షో, ఎన్టీఆర్ షో పోటీపడుతూనే ఉన్నాయి. మొదట్లో రానా మీద ఎన్టీఆర్ పై చెయ్యి సాధించడంతో బుల్లితెర మీద కూడా ఎన్టీఆర్ కి తిరుగులేదని రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. బిగ్ బాస్ షోలో ఎన్టీఆర్ చేసే ఎనర్జీ పెరఫార్మెన్సు, అలాగే ఎంటర్టైన్మెంట్ పెరుగుతూ రావడం, ఎన్టీఆర్ యాంకరింగ్ స్కిల్స్ అదిరిపోయే లెవల్లో ఉండడంతో  ఆరు వారాల పాటు బిగ్ బాస్ షో వన్ సైడ్ వార్ లా సాగింది. ఇక ఎన్టీఆర్ బిగ్ బాస్ ని బీట్ చెయ్యడం ఎవరివల్ల కాదని కూడా జనాలు ఫిక్స్ అయ్యారు.

Advertisement
CJ Advs

కానీ అనూహ్యంగా ఆరు వారాల తర్వాత టీఆర్పీ రేటింగ్స్ అన్ని తారుమారయ్యాయి. టాప్ లో ఉన్న బిగ్ బాస్ రేటింగ్స్ డౌన్ అవడం.... అదే టైం లో రానా నెంబర్ 1 యారి షో కి రేటింగ్స్ పెరగడం జరిగిపోయాయి. గత వారంలో బిగ్ బాస్ షో ని రానా యారి షో బీట్ చేసి నెంబర్ 1 ప్లేస్ కి వెళ్ళిపోయింది. ఇక స్టార్ మా మొన్నటివరకు ఫస్ట్ ప్లేస్ లో కొనసాగి... నిన్నటివరకు సెకండ్ ప్లేస్ కి పడిపోయింది. ఇక ఇప్పుడు మరీ దారుణంగా నిన్నటివరకు రెండో స్థానంలో ఉన్న స్టార్ మా ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయి షాక్ ఇచ్చింది. ఇప్పుడు జెమిని ఛానల్ హైయెస్ట్ రేటింగ్స్ తో నెంబర్ వన్ ప్లేస్ కి వెళ్ళిపోయింది. అయితే జెమిని నెంబర్ 1  ప్లేస్ కి వెళ్ళడానికి రానా నెంబర్ 1 యారి షోనే కారణం అంటున్నారు. రానా వల్లనే జెమిని ఛానల్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ కి వచ్చేసింది.

రానా షో మొదటి ఎపిసోడ్స్ కంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ పెరగడం వల్లే ఈ షో ఫస్ట్ ప్లేస్ కి వచ్చిందంటున్నారు. మరి ఎన్టీఆర్ ఎనర్జీతో బిగ్ బాస్ షోకి మంచి క్రేజ్ తెచ్చాడు కానీ... ఇప్పుడు ఎన్టీఆర్ కన్నా రానా ఎంటెర్టైమెంట్ కే తెలుగు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారంటున్నారు. అయితే రానా ఇప్పుడు నెంబర్ 1 గా అవతరించడానికి... ఎన్టీఆర్ షో పడిపోవడానికి కారణం రానా షోకి బాలకృష్ణ వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చెయ్యడం వలెనే ఇలాంటి స్థితి ఎన్టీఆర్ షోకి వచ్చినట్లుగా ఎన్టీఆర్ ఫాన్స్ అనుకుంటున్నారు. రానా షోలో బాలకృష్ణ 'పైసా వసూల్' ప్రమోషన్ కోసం వచ్చి తెలుగు ప్రేక్షకులను ఫుల్ ఎంటెర్టైన్ చేశాడనే విషయం తెలిసిందే. అయితే అంతకుముందే ఎన్టీఆర్ షోకి ఆదరణ తగ్గడం రానా షోకి ఆదరణ పెరిగిన విషయం రానా ఫ్యాన్స్ గమనిస్తే మంచిదని ఎన్టీఆర్ ఫాన్స్ వాదిస్తున్నారు.  

Rana No 1 Yaari Beats NTR Big Boss Show:

Rana Daggubati's 'No 1 Yaari' competes with Jr NTR's 'Bigg Boss' in TV ratings
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs