Advertisement
Google Ads BL

బాలయ్య, పవన్ లు కొట్టుకోబోతున్నారు..!


వచ్చే సంక్రాంతికి రామ్‌చరణ్‌-సుకుమార్‌ల 'రంగస్థలం 1985', మహేష్‌బాబు-కొరటాల శివల 'భరత్‌ అనే నేను', బాలకృష్ణ - కె.యస్‌.రవికుమార్‌ల కాంబినేషన్‌లో బాలయ్య నటించే 102వ చిత్రంగా 'జయసింహ', పవన్‌కళ్యాణ్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల చిత్రం విడుదల కానున్నాయని అందరూ భావించారు. కానీ సంక్రాంతి పోరులోకి దూకడం ఇష్టం లేని రామ్‌చరణ్‌ తన 'రంగస్థలం 1985' చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లోనే విడుదలకు ముస్తాబవుతోంది. 

Advertisement
CJ Advs

మరోవైపు కొరటాల శివ - మహేష్‌బాబుల చిత్రం 'భరత్‌ అనే నేను' చిత్రం షూటింగ్‌ ప్రారంభించుకున్నప్పటికీ మహేష్‌ ఇంకా 'స్పైడర్‌' చిత్రం షూటింగ్‌లోనే ఉండటం, ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయినా కూడా ఇది మొదటి సారిగా మహేష్‌ కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నచిత్రం కావడం, భారీ బడ్జెట్‌తో పాటు తెలుగు, తమిళంలో ప్రమోషన్లను భారీగా చేయాలని నిర్ణయించడం వల్ల ఇప్పటివరకు 'భరత్‌ అనే నేను' చిత్రం షూటింగ్‌లో మహేష్‌ జాయిన్‌ కాలేదు. ఇక ఈ చిత్రం లాంగ్‌ షెడ్యూల్‌ని ఉత్తరప్రదేశ్‌లోని హిస్టారికల్‌ ప్లేసెస్‌లో ప్లాన్‌ చేశారు. కానీ దీనికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా పర్మిషన్‌ బాగా లేటయ్యే అవకాశాలు ఉండటంతో ఈ 'భరత్‌ అనే నేను' చిత్రం కూడా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ చిత్రం షూటింగ్‌ బాగా ఆలస్యం కానుంది. 

దీంతో వచ్చే సంక్రాంతికి పవన్‌-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం జనవరి 10న, బాలకృష్ణ -కె.ఎస్‌.రవికుమార్‌ల చిత్రం జనవరి 11న రిలీజ్‌ అయ్యే అవకాశాలున్నాయి. సంక్రాంతి హీరోగా పేరున్న బాలయ్యను ఈసారి పవన్‌ కళ్యాణ్‌ ఏ విధంగా ఎదుర్కోనున్నాడో వేచిచూడాల్సి వుంది...! 

PSPK25 and NBK102 in Sankranthi 2018 Race:

PSPK25 Film Team have officially announced the release date of this movie on 10th January. Other flick is a 102nd flick of Nandamuri Balayya and KS Ravi Kumar combinational flick which is rumored to be titled as Jayasimha also Sankranthi race.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs