Advertisement
Google Ads BL

మోక్షు డెబ్యూ డైరెక్టర్ ఈయనేనా బాలయ్యా?


బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ ఎప్పుడు సినీఎంట్రీ ఇవ్వబోతున్నాడో కాస్త క్లారిటీ ఇచ్చాడు. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా బుధవారం బాలకృష్ణ తన కొడుకు 2018  జూన్ తర్వాత సినిమా హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని సస్పెన్స్ కి తెర దించాడు. ఎప్పటినుండో మోక్షజ్ఞ సినీప్రవేశం ఉంటుందని వార్తలొస్తున్నాయి. కానీ క్లారిటీ మిస్ అవుతూ వస్తుంది. ఇక ఇప్పుడు బాలయ్య పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు కాబట్టి ఇక మోక్షజ్ఞ ని డైరెక్ట్ చెయ్యబోయే డైరెక్టర్ ఎవరా అంటూ మరొక ఉత్కంఠ మొదలైంది రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకుల్లో. అయితే బాలకృష్ణ, మోక్క్షజ్ఞ ని డైరెక్ట్ చెయ్యబోయే డైరెక్టర్ ని ముందుగానే ఫిక్స్ చేసినట్లుగా చెబుతున్నారు.

Advertisement
CJ Advs

ఆయన కెరీర్ లో మైలురాయి మూవీ అయిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం షూటింగ్ సమయంలోనే డైరెక్టర్ క్రిష్ పనితనం మెచ్చి బాలకృష్ణ తన కొడుకు బాధ్యతలను క్రిష్ చేతిలో పెట్టినట్లుగా అప్పుడే వార్తలొచ్చాయి. అయితే క్రిష్ కూడా ఉత్సాహంగా బాలయ్యకి ఒక స్టోరీ లైన్ చెప్పడం అది బాలయ్యకి నచ్చడం జరిగిపోయిందంటున్నారు. అయితే క్రిష్ చెప్పింది ఒక ప్రేమ కథ అని... అయితే  ఆ కథని డెవెలెప్ చెయ్యడంలో క్రిష్ ఇప్పుడు బిజీగా వున్నాడని వార్తలొస్తున్నాయి. బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ ని ఒక ప్రేమ కథా చిత్రంతోనే ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చెయ్యడానికి సిద్దమవుతున్నాడు. అందుకే ఆ ప్రేమకథని అందమైన పేమకథగా మార్చి ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమాని తెరకెక్కించమని బాలయ్య, క్రిష్ కి చెప్పాడట.

మరి క్రిష్ డైరెక్టర్ గా తీసిన సినిమాలను పరిశీలిస్తే 'గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి' లను డిఫ్రెంట్ డిఫరెంట్ కథలతో సినిమాలు తెరకెక్కించాడు. మరి ఇప్పుడు ఫ్రెష్ లవ్ స్టోరీ అంటే క్రిష్ కొత్త ప్రేమ కథని ఎలాంటి స్టయిల్లో చూపెట్టనున్నాడో... అంటున్నారు. ఇక ఇప్పుడున్న ఫాస్ట్ లవ్ స్టోరీస్ లాగా కాకుండా.... ఒక స్లో అండ్ ఫీల్ లవ్ స్టోరీ ని తెరకెక్కించాలని ప్లాన్ లో క్రిష్ ఉన్నాడట. ఇక బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞ కెరీర్ విషయంలో ఇప్పటినుండే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడని... మోక్షుతో చేసే డైరెక్టర్స్ అంతా టాలెంటెడ్ అండ్ మంచి డైరెక్టర్స్ తోనే సినిమాలు చేపించాలనుకుంటున్నాడట. చూద్దాం మోక్షు ప్రేమ కథతో ఎలా మెప్పిస్తాడో.!

Krish Directes Nandamuri Mokshagna Debut Movie :

Balakrishna Son Mokshagna Cine Entry Updates 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs