Advertisement
Google Ads BL

అనుష్క కి 'అర్జున్ రెడ్డి' తెగ నచ్చేశాడు..!


'అర్జున్ రెడ్డి' సునామి ఇంకా సమసిపోలేదు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'అర్జున్ రెడ్డి' ఒకపక్క కలెక్షన్స్ సునామి సృష్టిస్తూనే వుంది. మరోపక్క ఈ సినిమాపై సెలబ్రిటీస్ ప్రశంసల జల్లు కురిపిస్తూనే వున్నారు. కాకపోతే కాంట్రవర్సీల గోల మాత్రం కొద్దిగా తగ్గినట్టే కనబడుతుంది. ఇక మిగిలింది ఒక్కటే సమస్యతో 'అర్జున్ రెడ్డి' సినిమా సతమతమవుతుంది. అదేమిటంటే 'అర్జున్ రెడ్డి' శాటిలైట్ రైట్స్ విషయంలో కాస్త సమస్యని ఎదుర్కొంటుంది. మరి మళ్ళీ సెన్సార్ మెట్లెక్కనున్న 'అర్జున్ రెడ్డి' కి ఈసారి సెన్సార్ బోర్డు ఎలాంటి చుక్కలు చూపెడుతుందో.. అలాగే ఎక్కువ కట్స్ ఇస్తే సినిమా శాటిలైట్ రైట్స్ కొనడానికి ఎవరైనా ముందుకొస్తారా లేదా అనేది గత రెండు మూడురోజులుగా జరుగుతున్న చర్చ.

Advertisement
CJ Advs

అయితే తాజాగా పైసా వసూల్ ని తొక్కేసి యుఎస్ లో దూసుకుపోతున్న 'అర్జున్ రెడ్డి'కి మరో టాప్ సెలెబ్రిటీ పొగడ్తలు లభించాయి. 'బాహుబలి' తో దేవసేనగా జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న అనుష్క శెట్టి 'అర్జున్ రెడ్డి' సినిమా చూశానని... 'అర్జున్ రెడ్డి' తప్పక చూడాల్సిన సినిమా అంటూ తన పేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఈ సినిమాను తప్పకుండా చూడండి..... అలాగే ఈ చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరినీ నేను నిజాయితీగా, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.. ప్రొడ్యూసర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ షాలిని పాండే, రాహుల్ రామకృష్ణ ఇంకా ఈ చిత్రంలో నటించిన ప్రతిఒక్కరికి పేరు పేరునా అభినందిస్తున్నాను అంటూ పోస్ట్ చేసింది.

ఇక ఇలా 'అర్జున్ రెడ్డి' టీమ్ ని పొగుడుతూ ట్వీట్ చెయ్యడమే కాదు.. 'అర్జున్ రెడ్డి' పోస్టర్ ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరి ఇప్పటికే టాప్ సెలెబ్రిటీల మన్ననలు పొందుతున్న 'అర్జునరెడ్డి' చిత్రం ఇంకా ఇంకా సెలబ్రిటీస్ ని ఆకర్షించడమే కాదు.... ప్రేక్షకులు కూడా 'అర్జున్ రెడ్డి' చిత్రానికి నీరాజనాలు పడుతున్నారు. 

Anushka heaps praises on Arjun Reddy:

After watching the movie in a special screening, Anushka was very excited and spoke highly about the film on her Face book account. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs