Advertisement
Google Ads BL

'జై' ఉంటే 'జై లవ కుశ' కి సార్ధకత ఉండేది!


ప్రస్తుతం ఎన్టీఆర్‌ నటిస్తున్న త్రిపాత్రాభినయ చిత్రం 'జై లవ కుశ' చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి. విడుదలైన అన్ని పాటలు వీక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో మరో పాట ఉంటుందని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ తెలిపాడు. ఈ పాట అదరగొట్టే ఫోక్‌ సాంగ్‌గా ఉంటుందని, ఫోక్‌స్టైల్లో ఈ పాట అదరగొడుతుందని అంటున్నారు. ఈ సందర్భంగా యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ, మనసుకు నచ్చిన చిత్రం చేయాలా? లేదా ట్రెండ్‌ని ఫాలో కావాలా? అని ఎంతో ఆలోచించాను. చివరకు బాబీ చెప్పిన కథ విని, మనసుకు నచ్చిన సినిమానే చేయాలని ఫిక్స్‌ అయ్యాను. 

Advertisement
CJ Advs

'జై లవ కుశ' స్టోరీ నాకు బాగా నచ్చింది. మా పెద్దనయ్య, కీర్తిశేషులు జానకీరామ్‌ ఈస్టేజీ మీద ఉంటే 'జై లవ కుశ' కథకు మరింత సార్ధకత చేకూరి ఉండేది. మా నాన్న హరికృష్ణకు 60వ జన్మదినోత్సవ కానుకగా ఈ చిత్రం అందించాలని ఎంతో ట్రై చేశాం. కానీ ఏ తేదీ అయితే ఏముంది? ఈ సినిమాను మా తండ్రికి అన్నదమ్ముల కానుకగా అందిస్తున్నామని ఎన్టీఆర్‌ ఉద్వేగంగా ప్రసంగించారు. కాగా ఈ చిత్రం ఈనెల 21 వ తేదీన విడుదలకు సిద్దమవుతూ, దసరా సంబరాలను ఒక వారం ముందుగానే తీసుకొస్తోంది.....! 

Jr NTR about Jai Lava Kusa Movie:

Jai Lava Kusa is Brothers Movie, Jr NTR said.   
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs