Advertisement
Google Ads BL

జై లవ కుశ, స్పైడర్ పాటల గురించి వార్..!


ఈ దసరాకి రెండు బడా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జై లవ కుశ'తో సెప్టెంబర్ 21 నే వచ్చేస్తుండగా.. మహేష్ బాబు తన 'స్పైడర్' తో సెప్టెంబర్ 27 న థియేటర్స్ లోకి దిగిపోనున్నాడు. ఈ రెండు సినిమాల్తో పాటే.. మారుతీ - శర్వానంద్ ల 'మహానుభావుడు' కూడా ఈ దసరాకే రానుంది. ఇకపోతే సినిమాల డేట్స్ దగ్గర పడుతున్న కొద్ది ఆయా సినిమాల ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే 'జై లవ కుశ' పాటలు మార్కెట్ లో హల్చల్ చేస్తున్నాయి. దేవిశ్రీ స్వరాలు సమకూర్చిన 'జై లవ కుశ' పాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని పడెయ్యగా.. స్పైడర్ సాంగ్స్ కూడా ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి.

Advertisement
CJ Advs

హరీష్ జైరాజ్ 'స్పైడర్' చిత్రానికి సంగీత దర్శకుడు. 'స్పైడర్' నుండి బయటికి వచ్చిన రెండు పాటలు మహేష్ అభిమానులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. అయితే 'జై లవ కుశ' మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్స్ పాతగా ఉన్నాయని.. ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా ఉన్నాయని.. అలాగే దేవిశ్రీ 'జై లవ కుశ' కోసం పాత సినిమాల్లోని ట్యూన్స్ కాపీ కొట్టాడంటున్నారు మహేష్ అభిమానులు. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్ప మిగతా ప్రేక్షకులు కూడా 'జై లవ కుశ' పాటలతో పెద్దగా సంతృప్తి పడినట్లుగా కనబడటం లేదంటున్నారు. ఇక మహేష్ 'స్పైడర్' పాటల పరిస్థితి కూడా అలాగే ఉందంటున్నారు. హరీష్ జై రాజ్ పాత ట్యూన్స్ నే ఇచ్చాడని... అసలు 'స్పైడర్' టీమ్ వదిలిన రెండు పాటలు తమిళ వాసన కొడుతున్నాయనే టాక్ మొదలయ్యింది.

మహేష్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు ఈ రెండు సినిమాల పాటల గురించి సోషల్ మీడియాలో లో కొత్తగా ఆల్బమ్ యుద్ధం స్టార్ట్ చేశారంటున్నారు. 'జై లవ కుశ' పాటలు రొటీన్ గా ఉన్నాయని మహేష్ ఫ్యాన్స్ అంటుంటే... 'స్పైడర్' పాటలు కూడా ఏమంత కొత్తగా లేవని కామెంట్స్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇక మహేష్ ఫ్యాన్స్ అయితే 'స్పైడర్' పాటలు మొత్తం రానివ్వండి అప్పుడు మా తడాఖా చూపెడతాం అంటున్నారు. మరి దేవిశ్రీ సంగీతం చప్పగానే ఉంది.. అలాగే హరీష్  జై రాజ్ కూడా ఏమంత గొప్పగా ట్యూన్స్ ఇవ్వలేదనే టాక్ మాత్రం వినబడుతుంది. మరి 'జై లవ కుశ' ట్రైలర్, 'స్పైడర్' ట్రైలర్ విడుదలయ్యేవరకు వీరి మాటల యుద్ధం ఆగేలాగా కనబడటం లేదు.

Fans Fight for Jai Lava Kusa and Spyder Songs:

Jai Lava Kusa and Spyder Songs Feed Back 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs