Advertisement
Google Ads BL

శ్రియకి కిక్ ఇచ్చే జాబ్ ఇచ్చారు!


శ్రీయ శరణ్ కి యూత్ హీరోల పక్కన ఛాన్స్ లు రావడం లేదు. అందుకే ఈ సీనియర్ హీరోయిన్ పని ఇక అయ్యిపోయింది అనుకున్నారు అంతా. కానీ నాగార్జున అక్కినేని ఫ్యామిలీ సినిమా 'మనం' లో మంచి పాత్ర ఇచ్చి ఆదుకున్నాడు. ఆ సినిమా హిట్టవ్వడంతో వెంకటేష్ తన 'గోపాల గోపాల' సినిమాలో తన భార్య కేరెక్టర్ ఇచ్చాడు. ఆ సినిమా కూడా హిట్టయ్యింది. అయితే శ్రీయ మధ్య మధ్యలో అవార్డు ఫంక్షన్స్ లో గట్రా అదిరిపోయే డ్రెస్సులు వేస్తూ ఆకట్టుకుంటున్నప్పటికీ ఆమెకి అదిరిపోయే ఛాన్సులు మాత్రం రావడంలేదు. అటువంటి టైంలోనే బాలకృష్ణ, క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో అవకాశం ఇచ్చాడు.

Advertisement
CJ Advs

ఆ సినిమాతో  శ్రీయ కి మళ్ళీ హిట్ కొట్టింది. ఆ దెబ్బకి బాలయ్య మరలా తన 'పైసా వసూల్' కోసం మెయిన్ హీరోయిన్ గా శ్రీయ ని తీసుకున్నాడు. ఇక ఆ సినిమా చేస్తూనే కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన 'నక్షత్రం'లో సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ లో నటించి మెప్పించింది. కానీ 'నక్షత్రం' సినిమా అట్టర్ ప్లాప్ అయినా శ్రీయ సాంగ్ కి మాత్రం పేరొచ్చింది. అయితే ఇప్పుడు శ్రీయ శరణ్ కి ఎయిర్ హోస్టెస్ కేరెక్టర్ వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇంద్రసేన దర్శకత్వంలో నారా రోహిత్- సుధీర్ బాబు మెయిన్ రోల్స్ చేస్తున్న ‘వీర భోగ వసంతరాయలు’ సినిమాలో లో శ్రీయ ఈ  ఎయిర్ హోస్టెస్ రోల్ చేస్తోందనే టాక్ వినబడుతుంది. 

అయితే కొన్నినెలల ముందే 'వీర భోగ వసంతరాయలు’ షూటింగ్ స్టార్ట్ అయిన ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌లో శ్రీయ రోల్ హైలైట్ కానుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్‌లో ఉందని..త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం అందుతుంది. 

Shriya turns Air Hostess:

After playing an investigation scribe in the recently released Balakrishna’s Paisa Vasool, Shriya Saran will next been seen as an air hostess.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs