Advertisement
Google Ads BL

ఆ కళ్యాణ్ పాలిటిక్స్ కెళ్ళినా మరో కళ్యాణ్ రెడీ!


పెద్దలని ఎదిరించి చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజ, శిరీష్‌ భరద్వాజ్‌ని ప్రేమ వివాహం చేసుకుని సంచలనం సృష్టించింది. ఆ తర్వాత విబేధాలు వచ్చి ఆ జంట విడిపోవడం, వారికి కలిగిన ఓ ఏకైక పాపకి అది శాపంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే తండ్రికి దూరమైన ఆ పాపను మెగాస్టార్‌ చిరంజీవి తన కుమార్తె రెండో వివాహం చేసుకున్న నేపధ్యంలో వారి కాపురానికి పాప అడ్డంకిగా భావించి ఆ పాపను హాస్టల్‌లో చేర్పించారు అనే వార్త నాడు హల్‌చల్‌ చేసింది. 

Advertisement
CJ Advs

ఇక చిరంజీవి రెండో కుమార్తె శ్రీజను నెల్లూరుకు చెందిన ప్రముఖ బంగారు వ్యాపారి తనయుడు కనుగంటి కళ్యాణ్‌బాబు వివాహం చేసుకున్నాడు. ఇతను చిరు చిన్న కుమార్తెను రెండో వివాహం చేసుకున్నా ఆయన ఎంతో దూరదృష్టితో ఆ నిర్ణయం తీసుకున్నాడని నెల్లూరు వాసులు చెప్పుకుంటారు. ఆయన స్నేహితుల సమాచారం ప్రకారం కనుగంటి కళ్యాణ్‌బాబుకి మొదటి నుంచి నటుడు కావాలనేది కోరిక. ఈ విషయాన్ని ఆయన తన స్నేహితుల వద్ద కూడా అనేక సార్లు చెప్పాడంటారు. ఇక ఆమధ్య చిరంజీవిని మీ చిన్నల్లుడు కళ్యాణ్‌బాబుని హీరోని చేస్తారా? అని అడిగితే అబ్బే అలాంటిదేమీ లేదని సమాధానం చెప్పాడు. 

కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తే మెగాస్టార్‌ కుటుంబం నుంచి మరో కళ్యాణ్‌బాబు అనే హీరో రావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. తాజాగా కనుగంటి కళ్యాణ్‌బాబు తీసుకున్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సినీ హీరో లెవల్లో ఇచ్చిన ఈ స్టిల్‌ కనుగంటి కళ్యాణ్‌రామ్‌ తీయించుకున్న ఫొటో షూట్‌లోనిదా? లేక ఆయన నటిస్తున్న చిత్రంలోని లుక్కా? అనే విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Kalyan Kanuganti New Mega Hero:

Kalyan Kanuganti – The New Mega Family Hero Photoshoot
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs