బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదన్నా వుంది అంటే అది ఒకటి లక్ష్మి రాయ్ నటిస్తున్న 'జూలీ 2' ట్రైలర్ గురించి... మరొకటి కంగనా రనౌత్ మాటల యుద్ధం గురించి. ఇక లక్ష్మి రాయ్ 'జూలీ 2' లో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది. ఇక సినిమాలో ఎలాంటి అందాలతో విందు చెయ్యబోతుందో అనేది ఒకటైతే మరొకటి.. కంగనా రనౌత్ తన సినిమాల అప్ డేట్ ల కన్నా ఎక్కువగా ఎవరినో ఒకరికిని విమర్శిస్తూనే వార్తల్లో ఉంటుంది. అందులోను ఒకప్పుడు మాజీ ప్రియుడు హృతిక్ రోషన్ ని విమర్శిస్తూ హైలెట్ అయిన కంగనా మరోమారు నటుడు, నిర్మాత అయిన ఆదిత్య పంచోలీ పై విమర్శలకు దిగింది.
ఆదిత్య కూతురు కంటే తాను ఒక ఏడాది చిన్నదానిని అని.. తనకు 17 ఏళ్లు ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని.... సినిమాల విషయంలో ఆదిత్య తనను రక్తంవచ్చేలా కొట్టేవాడని, ఈ విషయంలో తనకు సాయం చేయాలని ఆయన భార్య జరీనాను వేడుకున్నా ఫలితం లేకపోయిందని బహిరంగానే ఆవేదన వ్యక్తంచేసింది. అయితే కంగనా రనౌత్, ఆదిత్య పంచోలీ ని అన్ని మాటలంటే ఆయనెందుకు ఊరుకుంటాడు. అందుకే ఆదిత్య పంచోలీ కూడా కౌంటర్ గా కంగనా రనౌత్ మీద తీవ్రంగా మండి పడ్డాడు. కంగనా రనౌత్ పిచ్చిదంటూ ఒకే ఒక్కముక్కలో తేల్చేసిన ఆదిత్య పంచోలి... తాము ఫిల్మ్ ఇండస్ర్టీలో చాలాకాలం నుంచి ఉంటున్నామని... ఇప్పటివరకు ఇంత అసహ్యంగా మాపై ఎవరు వ్యాఖ్యలు చేయలేదన్నారు. అసలు కంగనాని అలా వదిలెయ్యమని ఆమెపై లీగల్ యాక్షన్ తీసుకుంటున్నానని తెలిపాడు.
అసలు మిగతా బాలీవుడ్ నటుల విషయంలో కంగనా ఏం మాట్లాడిందో తనకు అనవసరమని.... తన విషయంలో ఆమె చెప్పినవన్నీ ముమ్మాటికీ అబద్ధాలేనని కొట్టి పారేశాడు. అసలు ఆమె నాపై వేసిన నిందలు నిరూపించాలని... కంగనా మాటల వల్ల తన కుటుంబం ఎంతో అవమానం ఎదుర్కొందని ఆవేదన వ్యక్తంచేశాడు.