గత కొన్నిరోజులుగా సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి.. పవన్‌ని, ఆయన ఫ్యాన్స్‌ని టార్గెట్ చేస్తూ వస్తున్న తీరు తగ్గడం లేదు కదా...! ఇటీవల పవన్‌కళ్యాణ్ కూడా ఈ విషయంలో ఇన్‌డైరెక్ట్‌గా మహేష్‌కత్తిపై విమర్శలు గుప్పించాడు. ఇక ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్ తనను టార్గెట్ చేయడం మానలేదని, తన ఫోన్‌కు వస్తున్న కాల్స్ ద్వారా చేస్తున్న దాడిని ఆపడంలేదని, వాటిని ఎంతదూరం తీసుకెళ్తారో వారికే వదిలేస్తున్నానని, తాను మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మహేష్ కత్తి అంటున్నాడు. ఇలా పవన్‌పై విమర్శలు చేయడంపై కత్తి మహేష్ తగ్గడం లేదు.. ఇక మహేష్‌కత్తిని టార్గెట్ చేయడంలో పవన్ ఫ్యాన్స్ కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడం లేదు. దీంతో పరిణామాలు ఎంత దూరం వెళ్తాయనేది ఇప్పుడు అందరిలో నెలకొన్న ప్రశ్న.
తాజాగా మహేష్ కత్తి మాట్లాడుతూ, కుల రహిత సమాజం కోసం ప్రయత్నిస్తున్నానని చెబుతోన్న పవన్ మరోవంక కాపులకిచ్చిన హామీని నెరవేరుస్తూ వారికి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పడం చూస్తే, పవన్ మాటల్లో, ప్రసంగాలలో అణువణువు అవగాహనారాహిత్యం, మూర్ఖత్వం కనిపిస్తున్నాయని అన్నాడు. రాజ్యాంగం మీద అవగాహన, రాజకీయ పరిణితికి ఆయన మాటలు చాలా దూరంగా ఉన్నాయని, కనీసం కామన్‌సెన్స్‌లేని ఇలాంటి వ్యాఖ్యలు పవన్ తెలియనితనాన్ని సూచిస్తున్నాయని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. తరతరాలుగా రిజర్వేషన్ల అమలులోని అవకతవకలతో పోరాడుతూ, ఇప్పటికీ వివక్ష అనుభవిస్తున్న కోట్ల మంది దళితుల గురించి మాట్లాడని పవన్, దళితుల సమస్యలు, హత్యలు, ఆత్మహత్యల గురించి కనీసం ట్వీట్లు కూడా చేయని ఇతడు....ఇప్పుడు రిజర్వేషన్ల గురించి, అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాడని మహేష్‌కత్తి ఘాటు విమర్శలు చేశాడు.
కనీసం 1శాతం లేని క్రిమిలేయర్ పెద్ద సమస్య అన్నట్లు పవన్ మాట్లాడుతు, ఫోజులిస్తున్నాడు. ఆయన మాటల్లో అణువణువునా అవగాహనారాహిత్యం, రాజకీయ లేమి కనిపిస్తున్నాయి. ఇప్పుడే కదా కాపులు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాడు. ముద్రగడ పద్మనాభం గురించి మాట్లాడమంటే అలాంటి సెన్సిటివ్ విషయాల గురించి మాట్లాడను... అనే ఈ పలాయనవాది దళితులు రిజర్వేషన్ల నిర్మూలనే ధ్యేయంగా ఉన్నట్లు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయన దళిత వ్యతిరేకి అనేది అర్ధమవుతోంది. ఇదే జనసేన పంధా అయితే.. అదే ఆయన 'స్థాయి' అయితే మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం ఇది అని మహేష్ కత్తి మరిన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడంపై పవన్ ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మరి ఇది ఎంత దూరం పోతుందో వేచిచూడాల్సివుంది...!