Advertisement
Google Ads BL

బాలయ్య కాదు పూరినే తేడా..!


పూరి వంటి దర్శకుడితో బాలకృష్ణ సినిమా చేస్తున్నాడు అనగానే అందరూ షాక్ అవడమే కాదు... ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు పూరి టెంపర్ ముందు బాలయ్య మెంటాలిటీ ఏం సెట్ అవుతుందని అనుకున్నారు. ఇక 'పైసా వసూల్' సినిమా షూటింగ్ జరిగేటప్పుడే గంటకి 250 కిలోమీటర్ల స్పీడుతో షూటింగ్ ని శరవేగంగా జరిపించేశాడు పూరి. ఇక బాలయ్య కూడా కుర్ర హీరోల మాదిరిగానే ఫుల్ ఎనర్జీతో పూరికి కోపరేట్ చేశాడు. పూరి చెప్పిందల్లా చేస్తూ బాలయ్య ఫుల్ జోష్ లో సినిమా షూటింగ్ చేసేశాడు. పూరికి బాలకృష్ణ పూర్తి స్వేచ్ఛనిచ్చి ఈ సినిమాలో కేవలం తన నటన తప్ప మరే ఇతర ప్రమేయం లేకుండా పూరి జగన్నాధ్ మీద 'పైసా వసూల్' బాధ్యతలను పూర్తిగా పెట్టేసాడు. మరి పూరి కూడా జెట్ స్పీడుతో కంప్లీట్ చేసేసి సినిమాని థియేటర్స్ లోకి తెచ్చేశాడు. మరి ఫస్ట్ డే ఫస్ట్ షోకే సినిమాకి ఎలాంటి టాక్ వచ్చిందో అందరికి తెలిసిందే. 

Advertisement
CJ Advs

మరి బాలయ్య ఇచ్చిన స్వేచ్చని పూరి ఎలా వినియోగించుకున్నాడు.. అంటే సినిమా చూశాక పూరి తన పంధాని మళ్ళీ రిపీట్ చేసాడు. బాలయ్య ఇచ్చిన సపోర్ట్ ని పూరి విస్మరించాడు. అసలు పూరి 'లోఫర్, జ్యోతిలక్ష్మి, ఇజం' లాగే మరో ప్లాప్ ని నెత్తిన వేసుకున్నాడు అనే మాట వినబడుతుంది. అలాగే బాలకృష్ణ మాత్రం తన వైపు నుండి సినిమాని గట్టెక్కించే ప్రయత్నం గట్టిగా చేశాడు. సినిమాకి కావాల్సిన పబ్లిసిటీ విషయంలోనూ..నటన, ఫైట్స్, డైలాగ్ డెలివరీ ఇలా అన్ని విషయాల్లో 'పైసా వసూల్' ని భుజాన వేసుకుని కష్టపడ్డాడు. ఇక బాలయ్య ఈ సినిమాకి చేయాల్సన దాని కన్నా ఎక్కువే చేశాడు. 

కానీ పూరి మాత్రం 'పైసా వసూల్' ని పచ్చడి పచ్చడి చేసి వదిలేశాడు. అసలు కామెడీ ట్రాక్ లేకుండా హీరోగారి మీద హీరోగారే భారీ పంచ్ లు వేసుకోవడం, హీరోయిన్స్ ని కేవలం గ్లామర్ కే వాడడం, విలన్స్ ని డమ్మీ చెయ్యడం వంటి వాటితో 'పైసా వసూల్' కి పైసల్ పోయేలా చేసిన పూరికి బాలకృష్ణ మరోమారు ఛాన్స్ ఇచ్చాడంటే మాత్రం ఎవ్వరికి నమ్మకమే కుదరడం లేదు. 

Puri Jagannadh Misused Balayya Chance:

Paisa Vasool Another Flop to Puri Jagannadh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs