Advertisement
Google Ads BL

అనసూయ 'నింద నిజమైతే తప్పక దిద్దుకో'!!


సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ - సమంత జంటగా తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985' సినిమాలో యాంకర్ కమ్ యాక్ట్రెస్ అయిన అనసూయ కూడా నటిస్తుంది. 1985 కాలం నాటి ప్రేమ కథని తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం సుకుమార్ చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నాడు. అలనాటి పల్లెటూరి వాతావరణం కోసం పక్కా పల్లెటూర్లలోనే ఈ సినిమా షూటింగ్స్ కోసం వాడిన సుకుమార్ ఇంకా సరిపోక అలనాటి పల్లెటూరి సెట్ ని కాస్ట్లీగా కూడా వేయించాడు. ఇకపోతే ఈ సినిమాలో సమంత పల్లెటూరి అమ్మాయిలా కనబడబోతుంది. అలాగే ఆ కేరెక్టర్ కి సంబందించి సమంత కూర్చొని వున్న బ్యాక్ లుక్, పట్టీలతో వున్న రెండు కాళ్ళు మాత్రం ఇప్పటివరకు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

Advertisement
CJ Advs

అయితే ఈ చిత్రంలో అనసూయ ఐటెం సాంగ్ చేస్తుందని... అలాగే హాట్ హాట్ గా కనబడనుందనే ప్రచారం వుంది. కాకపోతే ఇప్పుడు అనసూయ వదిలిన 'కుండ... కాలు' లుక్ చూస్తుంటే మాత్రం అనసూయ కూడా పల్లెటూరి పడుచులాగే కనబడుతుంది. ఆ పిక్ తో పాటు అనసూయ 'నింద నిజమైతే తప్పక దిద్దుకో.. అబద్ధమైతే నవ్వేసి ఊరుకో..' అంటూ సాగే ఒక డైలాగ్‌ ని కూడా పోస్ట్ చేసింది. మరి అనసూయ పెట్టిన ఫోటో ఇంట్రెస్ట్ గా కనిపిస్తుంది అలాగే ఆమె పెట్టిన డైలాగ్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. 

'నింద నిజమైతే తప్పక దిద్దుకో.. అబద్ధమైతే నవ్వేసి ఊరుకో..' అనే దానికి ఎవరికీ నచ్చిన అర్ధాలు వారు తీసుకోవచ్చు గాని.. సినిమాలో ఆ డైలాగ్ ఎప్పుడొస్తుందో అనేది మాత్రం ఏ టీజర్ లోనో లేక ట్రైలర్ లోనో... ఆ రెండు కాకపోతే మాత్రం సినిమా విడుదల తర్వాత అర్ధమవుతుంది. 

మరి అనసూయ పెట్టిన ఆ ఫొటోలో ఓ కుండ.. ఆ పక్కనే ఓ అమ్మాయి కాలు కనబడుతుంది. ఇక ఆ కాలికి మెట్టెలు(అంటే పెళ్లి చేసుకున్న యువతి కాళ్లకు ఉండేవి) కనబడుతున్నాయి. అంటే ఆ అమ్మాయి మాత్రం అనసూయ అనుకునేలానే కనబడుతుంది. అంటే ఈ రంగస్థలం లో అనసూయ కేరెక్టర్ అనేది చిన్న క్లూ ఇచ్చేసిందా అనే అనుమానం వచ్చేస్తుంది. ఇక రంగస్థలం చిత్రం మాత్రం వచ్చే సంక్రాంతి బరిలో ఉంది.

Anasuya Posted Pic and Dialogue from Rangasthalam 1985:

Anasuya Leaked her Pre Look in Rangasthalam 1985
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs