Advertisement
Google Ads BL

ఆ శివ ఏమో గాని, నయన్ ఇంకో శివని పట్టేసింది?


నయనతారకు వయసు పెరుగుతోందే గానీ తమిళంలో మాత్రం వయసుతో పాటు ఆమె క్రేజ్‌తో పాటు ఇమేజ్‌ కూడా పెరిగిపోతోంది. తెలుగులో ఆమెకి సీనియర్‌ స్టార్స్‌ సరసనే అవకాశాలు వస్తున్నా.. కోలీవుడ్‌లో మాత్రం సీనియర్‌స్టార్స్‌ నుంచి యంగ్‌ హీరోల వరకు ఆమెతో కలిసి ఓ చిత్రంలోనైనా కలిసి నటించాలని కలలు కంటూ ఉంటారు. ఇప్పటికే ఉదయ్‌నిధి స్టాలిన్‌తో పాటు పలువురు కొత్త హీరోలు కూడా ఆమెతో జోడి కట్టారు. 

Advertisement
CJ Advs

ఇక నయనతో నటించాలని ఉందని ఆమద్య జయం రవి తన కోరికను బయటపెట్టాడు. అనుకున్నట్లుగానే తెలుగు 'ధృవ'కి ఒరిజినల్‌ వెర్షన్‌ అయిన 'తని ఒరువన్‌'లో ఆమెతో ఆడిపాడాడు. ఇక నయనతార తన సినిమాల కంటే పర్సనల్‌ విషయాలలోనే కోలీవుడ్‌లో ఎప్పుడూ వార్తల్లో ఉంటూ ఉంటుంది. మొదట శింబు, ఆ తర్వాత ప్రభుదేవాతో సహజీవనం చేసి మద్యలో బ్రేకప్‌కి గురైంది. ప్రస్తుతం తనకన్నా వయసులో నాలుగేళ్లు చిన్నవాడైన దర్శకుడు విఘ్నేష్‌శివన్‌తో రొమాన్స్‌, సహజీవనం గడుపుతోందని వార్తలు వస్తున్నాయి. ఈమద్యలో మరో వార్త ఆమెపై హల్‌చల్‌ చేస్తూ అందరినీ ఆకర్షిస్తోంది. 

ఆమెతో తాను కూడా కలిసి నటించాలని ఉందని యువ హీరో శివకార్తికేయన్‌ ఆమద్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అనుకున్నట్లుగానే వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రస్తుతం 'వేలైక్కారన్‌' రూపొందుతోంది. ఈ చిత్రం చేస్తున్న సమయంలో శివకార్తికేయన్‌ ఎక్కడ ఎప్పుడు ఎవరిని కలిసినా ఆయన నయనతార జపం చేయకుండా ఉండలేకపోతున్నాడట. ఆమె నటనాప్రతిభను, ఇతర ఆమె సుగుణాలను ఇతరులకు చెప్పిందే చెప్పి విసుగుపుట్టిస్తున్నాడట. మరోవైపు నయనతార కూడా ఎవరిని కలిసినా శివకార్తికేయన్‌ గురించిన సంగతులే చెబుతోందని అంటున్నారు. ఆమధ్య ఓ అవార్డు వేడుకలో నయనతార శివకార్తికేయన్‌ని విపరీతంగా పొగిడేసింది. 

'శివ వంటి వ్యక్తిని ఇప్పటివరకు చూడలేదు. ఆయన సెట్లో ఉంటే అంతా ఇంతా సందడే సందడి. సందడికి లోటుండదు. నటిస్తూనే అందరినీ నవ్విస్తూ ఉండటం ఆయనలోని గొప్పగుణం. ఆయనతో పనిచేస్తుంటే పని అలసట, ఒత్తిడి అసలు ఉండవు. ఆయన చాలా సరదా మనిషి. ఇలాంటి ప్రత్యేకత కేవలం నేను శివకార్తికేయన్‌లోనే చూశాను..' అని చెబుతోంది. 

అంతేకాదు మరో చిత్రంలో ఆమెను శివకార్తికేయన్‌ సరసన నటించాలని కోరగా, సామాన్యంగా సినిమాకి ముందు నిర్మాతలకు బోలెడు కండీషన్స్‌ పెట్టే నయన శివ నటిస్తున్నాడని తెలిసిన వెంటనే ఓకే చెప్పేసిందిట. దీంతో నయనతార ప్రస్తుతం శివకార్తికేయన్‌కి దగ్గరవుతోంది అని కోలీవుడ్‌ మీడియా కోడైకూస్తోంది. మరి విఘ్నేష్‌శివన్‌ పరిస్థితి ఏమిటి చెప్మా...! 

Nayanthara Praises Sivakarthikeyan:

Heroine Nayanthara again act with Sivakarthikeyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs