Advertisement
Google Ads BL

'సై రా'...నో కాంప్రమైజ్ రా..!


చిరంజీవి 151 వ చిత్రం 'సై రా నరసింహారెడ్డి' సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రామ్ చరణ్ నిర్మాతగా రూపుదిద్దుకోబోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ 'సై రా' చిత్రం ఆఫీషియల్ గా సెట్స్ మీదకెళ్ళింది. ఈ చిత్రంలో భారతదేశంలోని నాలుగు ఇండస్ట్రీలకు చెందిన టాప్ నటీనటులు భాగం పంచుకోబోతున్నారు. సినిమా అనౌన్సమెంట్ దగ్గరనుండే సినిమాపై అంచనాలు పెంచేసిన చిత్ర యూనిట్ ఇందులోకి ఇండియాలోనే టాప్ స్టార్స్ తీసుకుని మరిన్ని అంచనాలు పెంచేసింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జాతీయ స్థాయిలో విడుదల చెయ్యడానికి ఫిక్స్ అయ్యారు.

Advertisement
CJ Advs

ఇకపోతే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగానే జరుపుతున్న చిత్ర బృందంలో ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ 1840 ల నాటి వాతావరణ్నని సృష్టించేందుకు హైద్రాబాద్, పొలాచ్చి, రాజస్థాన్ లతో పాటు పలు ప్రాంతాలలో భారీ సెట్స్ నిర్మాణం చేపట్టారు. అలాంటి సెట్స్ ని రూపొందించేందుకు ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ చాల కష్టపడుతున్నారట. అయితే ఆనాటి కాలానికి సంబందించిన గుర్తులు ఏమి లేవు కాబట్టే....  బ్రిటిష్ పాలన నాటి తొలి స్వతంత్ర సమరానికి ముందు కాలం నాటి సెట్స్ వేయాల్సి ఉంటుంది. వాటికోసం  కేవలం పలు పుస్తకాలు, వీడియోలు మీద ఆధారపడి...  స్కెచ్ లు తయారు చేస్తున్నారట. ఇక స్కెచ్ లపైనే  15 మంది పని చేస్తున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా చరిత్ర కారులనుండి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటున్నారట.

పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రియాలిటీకి దగ్గరగా తీర్చిదిద్ధేందుకు చిత్ర బృందం బాగా కష్టపడుతున్నారని సమాచారం అందుతుంది. మరి 'సై రా' తో 500  కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని కసితో చిత్ర బృందం పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు కి జోడిగా నయనతార ఒక హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో ఇద్దరు హీరోయిన్స్ ని ఫైనల్ చెయ్యాల్సి ఉంది.

Ram Charan No Compromise to Sye Raa Budget:

1840 Look to Sye Raa Narasimha Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs