Advertisement
Google Ads BL

'జై లవ కుశ' కూడా నాన్న కోసమే..!


అన్నదమ్ముల అనుబంధాన్ని ప్రతిబింబించేలా 'జై లవ కుశ' చిత్రాన్ని తెరకెక్కించామని చెబుతున్నాడు ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా వస్తున్న 'జై లవ కుశ' చిత్రానికి సంబందించిన ఆడియో ప్రెస్ మీట్ ని హైదరాబాద్ లో చిత్ర బృందం నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ అన్నమాటలు ఇవి. లవ, కుశ అంటే అన్నదమ్ములుగా ఎంత ప్రేమ ఆప్యాయతలను కలిగి ఉంటారో...అలాంటి ప్రేమ, ఆప్యాయతలతో పాటు  చిన్న చిన్న రాగద్వేషాలు కూడా ఉంటాయని అలాంటి అన్నదమ్ముల కథతోనే ఈ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో తెరకెక్కించామని చెప్పుకొచ్చాడు.

Advertisement
CJ Advs

ఇక ఈ వేడుకకి నందమూరి హరికృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. హరికృష్ణ మాట్లాడుతూ అన్నదమ్ముల కథతో సినిమా తియ్యడమే కాదు అన్నదమ్ములిద్దరూ ఈ సినిమా కోసం పనిచేయడమే ప్రత్యేకమని చెప్పడమేకాకుండా... గతంలో నేను బాలకృష్ణ కూడా ఇలానే పనిచేశామని పాత రోజులు గుర్తు తెచ్చుకున్నారు. రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై తాను నిర్మాతగా సినిమా తెరకెక్కిస్తే, ఆ సినిమాలో తన తమ్ముడు బాలకృష్ణ నటుడిగా నటించాడని చెప్పిన హరికృష్ణ... మళ్ళీ ఇప్పుడు ఈతరంలో అన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా ప్రొడ్యూస్ చేస్తే తమ్ముడైన ఎన్టీఆర్ అందులో హీరోగా నటించాడని హరికృష్ణ తెలిపాడు. 

ఇక ఈ చిత్రాన్ని ఎంతోమనసు పెట్టి చేశానని... ట్రెండ్ ఫాలో అవుతూ చెయ్యలేదని చెప్పిన ఎన్టీఆర్  తన తండ్రి 60  వ పుట్టినరోజు కానుకగా ఈ 'జై లవ కుశ'ని ప్రేక్షకులకు అందిద్దామని ముందుగా అనుకున్నప్పటికీ మళ్ళీ 21 అయితే ఏమవుతుంది ఎప్పుడు విడుదల చేసినా ఇది మా నాన్నగారికోసమే మా అన్న నేను కష్టపడి చేశాము...అని చెప్పుకొచ్చాడు. ఇక దేవిశ్రీ అందించిన 'జై లవ కుశ' పాటలకు మంచి స్పందనే వస్తుంది.

Jr NTR Speech at Jai Lava Kusa Audio Release Event:

Jr NTR Dedicates Jai Lava Kusa For His Father Harikrishna 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs