Advertisement
Google Ads BL

మహేష్ గురించి మెగాబ్రదర్ ఏం చెప్పాడులే?


మెగాబ్రదర్స్‌ సినిమాలు, ఇతర విషయాల గురించి చాలా మందికి తెలుసేమో గానీ వారి వ్యక్తిత్వాలు మాత్రం చాలా మందికి తెలియవు. మెగాస్టార్‌ చిరంజీవి అందరి గురించి విషయాలు తెలుసుకుంటాడు. ఆయనకి ఇండస్ట్రీలోని అందరి గురించి తెలుసు. కానీ బయటపడడు. మనసులో దాచుకుంటాడు. ఇక పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ అనవసర విషయాలను అసలు నెత్తికెక్కించుకోడు. ప్రతిది మౌనంగా అంత:ర్ముఖంగా ఉంటాడు. కానీ నాగబాబు అలా కాదు.. తన మనసుకి నచ్చిన విషయాలను ఓపెన్‌గా చెప్పేసే బోల్డ్‌ మనిషి. 

Advertisement
CJ Advs

ఇక మెగా హీరోలు సామాన్యంగా తమ కాంపౌండ్‌ హీరోల గురించే మాట్లాడుతారు. ఇతరుల విషయాలను మంచైనా, చెడైనా తమ వరకు వస్తే గానీ స్పందించరు. కానీ దీనికి నాగబాబు మినహాయింపు. తాజాగా ఆయన ఓ వెబ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రిన్స్‌ మహేష్‌బాబు, ప్రభాస్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, రవితేజల గురించి మాట్లాడాడు. దానిలో ఆయన మహేష్‌ గురించి మాట్లాడిన వీడియో మాత్రం వైరల్‌ అవుతోంది. నాగబాబు మాట్లాడుతూ, చెన్నైలో ఉన్నప్పటి నుంచి తాను మహేష్‌ని చూస్తున్నానని, నాడు ఆయన చబ్బీగా ఉండేవాడని, ఇక హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత కూడా తాము వాకింగ్‌ చేస్తుంటే మహేష్‌ పరుగెత్తుతూ ఉండేవాడన్నాడు. చబ్బీగా ఉండే మహేష్‌ ఇప్పుడు ఎంతో మ్యాన్లీగా, అథెట్‌గా మారిపోయాడని తెలిపాడు. మహేష్‌ రన్నింగ్‌ చేస్తుంటే అచ్చు అథ్లెట్లు రన్‌ చేసినట్లుగా ఉంటుందని, ఆయన పరుగు తన కెంతో ఇష్టమన్నాడు. ఆయన పరుగును చూస్తే తనకు బోల్ట్‌ని చూసినట్లుగా ఉంటుందని కితాబునిచ్చాడు. మహేష్‌ అంత అందంగా ఎవ్వరూ పరుగెత్తలేరన్నాడు. మహేష్‌ కష్టాన్ని దగ్గరుండి చూశాను. ఇప్పటికీ ఆయన ఎంతో కష్టపడతాడు. ఆయన కష్టం, శ్రమ చూసిన వారికి ఆయనను ఏమైనా విమర్శించాలని ఎందుకు ఉంటుంది? అలా మాట్లాడితే అవి నాలుకలు కావు. కొబ్బరిమట్టలు అవుతాయని ఎంతో గొప్పగా చెప్పాడు. 

నేడు మహేష్ ఎంతో రేంజ్‌లో ఉన్నాడు. ఆయన అపార్ట్‌మెంట్‌కి, మాకు ఓ థ్రెడ్‌ మీల్‌ ఉండేది. ఆయనను అక్కడ అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాడిని. ఒక గంట సేపు విరామం లేకుండా పరుగెత్తుతాడు. అది కూడా మామూలు రన్నింగ్‌కాదు.... స్పీడ్‌ రన్నింగ్‌. ఆ స్థాయి, ఆ రేంజ్‌లో ఉన్నవారికి అంత కష్టపడటం అవసరమా? చెప్పండి. కానీ మహేష్‌ మాత్రం అంత కష్టపడుతాడు. అని నాగబాబు చెప్పుకొచ్చాడు. మిగిలిన వారు మహేష్‌ని పొగిడితే అది పెద్ద విషయం కాకపోవచ్చు గానీ, స్వయంగా మెగా బ్రదర్‌ మహేష్‌ని అంతగా పొగిడితే ఆ వీడియో సంచలనం కాక మరేమవుతుంది చెప్పండి...! 

Nagababu Praises Mahesh Babu:

Mega Brother Nagababu Talks About Super Star Mahesh Babu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs