ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న 'జై లవకుశ' లుక్‌తో పాటు ఈ పాత్ర టీజర్ కూడా అదిరిపోయింది. నేడు 'జై లవకుశ' చిత్రానికి ఇంత హైప్ వచ్చిందంటే అది కేవలం జై టీజర్ పుణ్యమే. 'లవ, కుశ' లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నా కూడా ఈ చిత్రానికి భారీ అంచనాలు వచ్చింది మాత్రం కేవలం కొన్ని సెకన్లలలోనే ఎన్టీఆర్ చూపించిన ఆ పాత్ర హావభావాలు, ఆయన నటన, ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ వల్ల మాత్రమే.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన 'జై' పాత్రకు సంబంధించిన పోస్టర్‌ని రిలీజ్ చేసి తన అభిమానులకు ఎన్టీఆర్ అనుకోని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఈ సినిమాలో రావణుడికి సంబంధించిన పోస్టర్‌ని రిలీజ్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. రావణా జై..జై...జై... సింహాసనా జై...జై...జై అనే క్యాప్షన్‌తో కూడిన పోస్టర్‌ని లహరి మ్యూజికల్ సంస్థ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ ఎంతో గంభీరంగా కనిపిస్తూ ఉన్నాడు. సాయికుమార్‌ది రావణునికి సపోర్టింగ్ క్యారెక్టర్ అని పోస్టర్‌ని చూస్తేనే అర్ధమైపోతోంది. సమ సమాజ్ పార్టీ నేతగా ఈ రావణుడి పాత్ర ఉండనుందని ఇంతకు ముందే తెలిసిన విషయం.
రావణుడి పాత్రకు రావణా జై...జై..జై.. సింహాసనా... జై...జై...జై.. అనే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందని సమాచారం. దీనికి దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన అదిరిపోయేలా, ఈ రావణుడి పాత్రను 100రెట్టు పవర్‌ఫుల్‌గా చూపించేలా ఆయన ఆర్‌ఆర్ కూడా ఇస్తున్నాడట. సోషల్‌మీడియాలో ఈ ట్రాక్ వింటుంటే గూస్ బమ్స్ వస్తాయని కొందరు, మరికొందరు అదిరిపోయిందంటూ కొందరు కామెంట్స్‌తో ముంచెత్తుతున్నారు.