'అర్జున్ రెడ్డి' సినిమా విడుదలవుతుంది అంటే ఒక పది రోజుల ముందు ఎటువంటి హడావిడి లేదు. అసలు అందులో విజయ్ హీరో, డైరెక్టర్ సందీప్ రెడ్డి అంటే కూడా ఆ ఏదో ఒక చిన్న సినిమా వస్తుందిలే.... అనుకున్నారు కానీ.. ఆ సినిమా విడుదలకు ముందు పెట్టిన 'అర్జున్ రెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఒక్కసారిగా ఆ సినిమా అంటే జనాల్లో ఆసక్తి మొదలైంది. ఆ ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు యువతకు బాగా కనెక్ట్ అవడం.. అలాగే లిప్ లాక్ కిస్సుల గురించి పెద్దాయన వీహెచ్ గారు అందరికి తెలిసేలా రచ్చ చెయ్యడంతో సినిమాకి ఎక్కడలేని హైప్ రావడమే కాదు.... సినిమాకి అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి.
మరి ఈ సినిమా విడుదలైన అని చోట్లా మంచి కలెక్షన్స్ రాబడుతూ మొదటి వారానికే దాదాపు 10 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ షేర్ సాధించి.... ఇప్పటికి అమెరికాలో సూపర్ కలెక్షన్స్‌తో ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తుంది. తక్కువ బడ్జెట్, చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఓ పెద్ద సినిమాలా కలెక్షన్స్ కొల్లగొడుతుంది అంటే మామూలు విషయం కాదు. ఇక ఏరియాల వారి 'అర్జున్ రెడ్డి' ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇలా వున్నాయి.
నైజాం-6.10 కోట్లు,
సీడెడ్-1.40
ఉత్తరాంధ్ర-1.05
ఈస్ట్ గోదావరి- 81 లక్షలు
కృష్ణా- 79
గుంటూరు- 75
వెస్ట్ గోదావరి- 42
నెల్లూరు- 28
టోటల్ తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ కలిపి: 11 కోట్ల 60 లక్షలు
ఓవర్సీస్- 3.75 కోట్లు
కర్ణాటక- 1 కోటి
మిగతా ఏరియాలు 65 లక్షలు
టోటల్ వరల్డ్ వైడ్ 17 కోట్లు కొల్లగొట్టి చిన్న చిత్రాలలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.