Advertisement
Google Ads BL

అబ్బాయ్ రెడీ..బాబాయే ఆలోచిస్తున్నాడు!


ఇటీవల తమిళంలో మంచి విజయం సాధించిన 'విక్రమ్‌వేద' చిత్రంలో మాధవన్‌, విజయ్‌సేతుపతిలు నటించారు. ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో వెంకటేష్‌, రానాలు నటిస్తారని ప్రచారం జరిగింది. ఇక ఈ చిత్రం వెంకీ నో అనడంతో నాగార్జున వద్దకు వెళ్లిందని సమాచారం. దీంతో తమ అభిమాన వెంకీ-రానాలను ఒకే సారి తెరపై చూడాలనుకున్న దగ్గుబాటి ఫ్యాన్స్‌కి కాస్త నిరుత్సాహం ఏర్పడింది. అయితే ఈ కాంబో మరో రూపంలో రూపుదాల్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 

Advertisement
CJ Advs

'రుద్రమదేవి'తో మంచి పేరు తెచ్చుకున్నా కూడా స్వీయ నిర్మాణం కారణంగా, ఓవర్‌ బడ్జెట్‌ కారణంగా ఈ చిత్రం ఆశించిన లాభాలను సాధించలేకపోయింది. దీంతో గుణశేఖర్‌ తన తదుపరి చిత్రాన్ని 'హిరణ్యకస్యప' పేరుతో హిరణ్యకస్యపుని కోణంలో జరిగే కథగా తెరకెక్కించాలని భావిస్తున్న గుణశేఖర్‌ ఈ చిత్రం టైటిల్‌ను కూడా రిజిష్టర్‌ చేయించాడు. కాగా ఇందులో ముఖ్యపాత్రకు రానాను సంప్రదించగా, 'రుద్రమదేవి'లో కూడా నటించిన రానా దగ్గుబాటి ఈ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపినట్లు, 'నేనే రాజు.. నేనే మంత్రి' తర్వాత రానా దగ్గుబాటి నటించే చిత్రం ఇదేనని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని 100కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలనేది గుణశేఖర్‌ లక్ష్యం. అందుకు అనుగుణంగా ఆయన ఈచిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించేందకు ప్లాన్‌ చేస్తున్నాడు. 

రానా దగ్గుబాటికి తెలుగు, తమిళం, హిందీలలో మంచి క్రేజే ఉంది. ఇక ఈ చిత్రాన్కి తెలుగులో మరింత క్రేజ్‌ తెచ్చేందుకు ఇందులోని ఓ కీలకపాత్రను బాబాయ్‌ వెంకటేష్‌ని గుణశేఖర్‌ అడిగాడట. దాంతో కథ విన్న వెంకీ తన నిర్ణయాన్ని త్వరలోనే తెలుపుతానని చెప్పాడనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ చిత్రానికి మరింత మల్టీస్టారర్‌ క్రేజ్‌ వచ్చేలా చేసేందుకు మరో ఇద్దరు ముగ్గురు ప్రముఖ హీరోలతో కూడా దీనిలో పాత్రలు పోషించేలా చేయడానికి గుణశేఖర్‌ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. 

Venkatesh and Rana in Gunasekhar Movie Hiranyakasyapa:

Venkatesh and Rana Daggubati Combo Movie Soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs