Advertisement
Google Ads BL

రామ్ చరణ్ కి బాబాయ్ ఎప్పుడూ స్పెషలే!


మెగాస్టార్‌ చిరంజీవికి, అల్లు వారి ఫ్యామిలీకి కొంత విబేధాలున్నాయని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే వాటికి మరింత రంగు, మసాలా జోడించి ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవికి, తమ్ముడు పవన్‌కళ్యాణ్‌కి కూడా విబేధాలున్నాయనే ప్రచారం ఎక్కువైంది. రాజకీయంగా వారిద్దరి మద్య స్పర్ధలు, వైరుధ్యాలు ఉన్న మాట నిజమేనని, తన సిద్దాంతాల కోసం తన అన్ననే కాదనుకున్నానని స్వయంగా పవన్‌ కూడా చెప్పాడు. కానీ మెగాస్టార్‌ చిరంజీవికి, ఆయన కుమారుడు మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌కి, బాబాయ్‌ పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌కి కూడా విబేదాలున్నాయని ఓ వర్గం ప్రజలు వార్తల మీద వార్తలు ప్రచారం చేస్తున్నారు.

Advertisement
CJ Advs

వీటన్నింటికి అబ్బాయ్‌ రామ్‌చరణ్‌ ఒకే ఒక్క ఫొటో, ట్వీట్‌తో ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. తన బాబాయ్‌ పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా అబ్బాయ్‌ తన బాబాయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడమే కాదు.. తమ్ముడు పవన్ తో  అన్నయ్య మెగాస్టార్‌ చిరంజీవి ఎంతో ఆప్యాయంగా తమ్ముడు పవన్‌కళ్యాణ్‌తో..... సేమ్‌ టు సేమ్‌ తన కొడుకుతో దిగిన ఫొటో ఫోజులోనే దిగిన ఫోటోను పోస్ట్‌ చేశాడు. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో బాగా షేర్‌ అవుతోంది. 

ఈ సందర్భంగా చరణ్‌ విషెస్‌ తెలుపుతూ, మీరు నా బాబాయ్‌ కావడం అదృష్టం అని చెప్పడం కూడా తక్కువే అవుతుంది. మీ అబ్బాయ్‌గా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. అదృష్టం, ఆశీర్వాదం పొందిన భావనతో ఉన్నాను. మీ నుంచి నిజాయితీ, సింపుల్‌గా ఉండటం నేర్చుకున్నాను. మనసులో ఉన్న భావాలనే మాట్లాడటం నేర్చుకున్నా... లక్ష మందిలో మీరొక వినయపూర్వక వ్యక్తి అని నిజంగా నమ్ముతున్నా...'పవర్‌ కే పవర్‌.. సింప్లిసిటీ.. హ్యూమానిటీలో ఉంది' అని రామ్‌చరణ్‌ రాశాడు. దీనితో పాటు హ్యాపీ బర్త్‌డే టు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ని జతచేశారు. ఈ విధంగా కేవలం రెండు మూడు వాక్యాలు, ఓ ఫొటోతో మెగాబ్రదర్స్‌పై వస్తున్న రూమర్లకు చెక్‌ పెట్టేశాడు అబ్బాయ్‌ రామ్‌చరణ్‌.

Ramcharan Birthday Wish To Pawan Kalyan:

<span>Looks like Mega family is making well use of Pawan Kalyan&rsquo;s birthday occasion in erasing the wrong assumptions and baseless allegations spread in digital media about the rifts created within family.</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs