పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని పతాకంపై రూపొందుతున్న పవన్ 25వ చిత్రంగా పిఎస్‌పికే 25 చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ వచ్చింది. ఈ రోజు పవన్ బర్త్‌డే కానుకగా 'జల్సా, అత్తారింటికిదారేది' చిత్రం తర్వాత పవన్ -త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొంందుతున్న ఈచిత్రంలోని ఓ పాటను సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ స్వయంగా గానం చేస్తుండగా, సాంగ్ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఇకవైపు అభిమానులనులద్దేశించి అరడజనుకు పైగా ట్వీట్స్ చేసిన పవన్ అభిమానులను ఆనందంతో ముంచెత్తగా పవన్, చిరంజీవి కలిసి ఉన్న ఫొటో, పవన్ సెట్స్‌లో చిరంజీవి, సురేఖలు ఉన్న ఫొటోలు అందరినీ అలరిస్తున్నాయి.
ఇక నేటి స్టార్స్ కూడా హీరోయిజం చూపించే చిత్రాల స్థానంలో హీరోయిజం ఉంటూనే కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపుతున్న తరుణంలో ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ మాత్రం అందరినీ సుదీర్ఘ ఆలోచనలో పడేసింది. 'బాహుబలి'లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే రీతిలో సింపుల్‌గా ఉన్న ఈ పవన్ పోస్టర్ కూడా పలు ఊహలకు తావిస్తోంది. సుదీర్ఘంగా ఆలోచిస్తున్న పవన్ ఫొటో అందులో ఒంటరిగా పవన్ నడుస్తూ సాగిపోతున్న లుక్‌ని చూస్తే ఈ చిత్రం కథ ఏదో తెలియని మిస్టరీగా అందరి మదిని తొలిచివేస్తోంది. ఈ పోస్టర్‌ని చూసిన వారికి అజ్ఞాతవాసం అనే పేరు వెంటనే మదిలో మెలుగుతుంది. అందుకు తగ్గట్లుగా ఈచిత్రం టైటిల్ కూడా 'అజ్ఞాతవాసి' అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
ఒక మనిషి తన ఆలోచనలకు అనుగుణంగా చేసే లైఫ్ జర్నీయే ఈ పోస్టర్ అంతర్ధాం అని కొందరు ఊహిస్తుంటే, తన జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఓ వ్యక్తి చేసే జీవన ప్రయాణమే ఈ పోస్టర్ అంతరార్ధం అని మరికొందరు, తన గురించి తాను తెలుసుకునే జీవన పయనమే ఈ సినిమా ఇతి వృత్తం అని మరికొందరు.. ఇలా పలు మంది పలు విశ్లేషణలు ఇస్తున్నారు.