Advertisement
Google Ads BL

'తొలిప్రేమ' మళ్లీ మెగా హీరోదే..!


'ముకుందా, కంచె, లోఫర్, మిస్టర్' సినిమాలతో విలక్షణ పాత్రలు చేస్తున్నాడని పేరు తప్ప పెద్ద హిట్ తెచ్చుకోలేని మెగా హీరో వరుణ్ తేజ్. కానీ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటించిన 'ఫిదా' చిత్రంతో ఒక్కసారిగా బంపర్ హిట్ కొట్టడమే కాదు... వరుణ్ టాక్ అఫ్ ద ఇండస్ట్రీ అయ్యాడు. 'ఫిదా' చిత్రంలో హీరోయిన్ సాయి పల్లవికి అందరికన్నా ఒకింత ఎక్కువ పేరొచ్చినా కూడా వరుణ్ తేజ్ పెరఫార్మెన్స్ కి కూడా మంచి మార్కులే పడ్డాయి. మరి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ మరోసారి ఇలాంటి ప్రేమ కథా చిత్రమే చేస్తున్నాడు. బివి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని చేస్తున్నాడు.

Advertisement
CJ Advs

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ మొదటిసారి రాశి ఖన్నాతో జోడి కట్టబోతున్నాడు. అయితే ఈ చిత్రానికి టైటిల్ గా పవన్ కళ్యాణ్ కెరీర్ తొలినాళ్లలో బిగ్గెస్ట్ హిట్ అయిన 'తొలిప్రేమ' టైటిల్ తోనే  వరుణ్ తేజ్ మరోమారు అలరించబోతున్నాడంటూ వార్తలొస్తున్నాయి. పవన్ కి 'తొలిప్రేమ' సినిమా ఎంతో ప్రత్యేకం. అందుకే వరుణ్ కూడా తన నెక్స్ట్ చిత్రానికి ఆ టైటిల్ కే ఓటేసాడో లేదో క్లారిటీ లేదుగాని 'తొలిప్రేమ' టైటిల్ ని మాత్రం ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించడంతోనే ఈ రకమైన ప్రచారం స్టార్ట్ అయ్యింది. ఆ టైటిల్ వరుణ్ తేజ్ సినిమాకే.... లేకుంటే ఆ టైటిల్ ని ఇప్పుడెందుకు రిజిస్టర్ చేయిస్తారంటున్నారు.

మరి ఈ విషయం అధికారికంగా ప్రకటించేవరకు మెగా అభిమానులు ఈమేరకు ఫిక్స్ అయ్యే ఉంటారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. తన ట్విట్టర్ లో కూడా తమన్ తాజాగా 'తొలిప్రేమ' గురించి ప్రస్తావించడం చూస్తుంటే ఖచ్చితంగా ఈ టైటిల్ వరుణ్ కే అని అర్ధమవుతుంది. 

Varun Tej's New Film Title Tholiprema?:

Power Star Pawan Kalyan's Tholiprema was the first memorable blockbuster in the actor's career. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs