Advertisement
Google Ads BL

పైసల్ వసూలు కాకుండానే పార్టీనా..!


భవ్య క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కిన 'పైసా వసూల్' చిత్రం నిన్న శుక్రవారమే విడుదలై థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చిందని  చెప్పినప్పటికీ క్రిటిక్స్ మాత్రం 'పైసా వసూల్' ని ప్లాప్ గా తేల్చేసి నెగెటివ్ రివ్యూస్ ఇచ్చారు. అసలు 'పైసా వసూల్' ఓవరాల్ గా చూస్తే కేవలం నందమూరి ఫాన్స్ కి మాత్రమే అని.. మిగతావారికి తేడా... తట్టుకోవడం కష్టమని  అన్నారు. అలాగే 'పైసా వసూల్' లో బాలకృష్ణ తప్ప ఇంకేం కొత్తగా లేదని.. కేవలం బాలకృష్ణ ఎనర్జీ పెరఫార్మెన్స్ తప్ప సినిమా ఏం లేదని తేల్చేశారు. అంటే ఈ లెక్కన 'పైసా వసూల్' తో పూరి మరోమారు ప్లాప్  అందుకున్నాడన్నమాటేగా...

Advertisement
CJ Advs

మరి సినిమా రిజల్ట్ ఇలా నెగెటివ్ గా వుంది కానీ... 'పైసా వసూల్' చిత్ర యూనిట్ మాత్రం సక్సెస్ పార్టీ అంటూ హడావిడి చేసేస్తున్నారు. అంటే మీడియా ఎదుట కాదుగాని పర్సనల్ గా 'పైసా వసూల్' చిత్ర డైరెక్టర్ పూరితో పాటే ఆయనగారి కొడుకు ఆకాష్, 'పైసా వసూల్' లైన్ ప్రొడ్యూసర్ ఛార్మి, బాలకృష్ణ, ముస్కాన్, కొంత మంది పూరి సన్నహితులు కలిసి పర్సనల్ గా పార్టీ చేసేసుకున్నారు. ఈ విషయాన్ని 'పైసా వసూల్' కి అన్ని తానై నడిపించిన ఛార్మి రివీల్ చేసింది. ఛార్మి పై పిక్ ని పోస్ట్ చేస్తూ ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ.. సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పింది. 

మరి సినిమా టాక్ ఏమో ఏమంత బాగోకపోయినా యూనిట్ మాత్రం పార్టీ చేసేసుకుని ఎంజాయ్ చేసేస్తున్నారన్నమాట. ఇక ఈ పార్టీలో బాలకృష్ణ బ్యాచ్ ఎదురుగా ఒక టేబుల్ వుంది. ఆ టేబుల్ మీద పార్టీకి కావాల్సిన సామాన్లు అంటే మందు గిందు లాంటివన్నీ ఉన్నాయి. మరి ఈలెక్కన ఈ పార్టీని 'పైసా వసూల్' టీమ్ పిచ్చగా ఎంజాయ్ చేసిందని చెప్పుకోవచ్చు.

Paisa Vasool Team in Party Mood :

Puri Jagannadh Arranged Grand Party to Paisa Vasool Team 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs