Advertisement
Google Ads BL

మ్యూజికల్ సర్ప్రైజ్ తో ఫిదా అవుతున్నారు!


సెప్టెంబర్ 2 మెగా హీరో పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఈ రోజు మెగా ఫ్యాన్స్ కి ఒక సంక్రాతి, ఒక దసరా వంటి పండగలకన్నా ఎక్కువైన రోజు. తమ అభిమాన హీరో పుట్టిన రోజు తమ పుట్టిన రోజుకన్నా ఎక్కువగా ఫీల్ అవుతూ పవన్ ని ఆరాధించేస్తారు ఫ్యాన్స్. అయితే పవన్ బర్త్ డే రోజున పవన్ ని కొత్తగా చూడాలనుకుంటారు ఫ్యాన్స్. అందులోను పవన్ తాజా సినిమాల లుక్ కోసం ఎంతో ఎదురు చూస్తారు. ప్రస్తుతం త్రివిక్రమ్ - పవన్ కాంబోలో రాబోతున్న కొత్త చిత్ర అప్ డేట్ కోసం అర్రులు చాచేలా చూస్తున్న పవన్ ఫాన్స్ కి పుట్టిన రోజుకి ఒక రోజు ముందే పవన్ కొత్త చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసి సర్ప్రైజ్ చేసిన చిత్ర టీమ్ ఈ రోజు శనివారం పవన్ పుట్టిన రోజుకి ఒక మ్యూజికల్ సర్ప్రైజ్ అంటూ ఒక పాటని వదిలింది.

Advertisement
CJ Advs

అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా రూపుదిద్దుకుంటున్న పవన్ తాజా చిత్ర పాటలలో ఒక పాటని వదిలి పవన్ ఫాన్స్ ని సర్ప్రైజ్ చేసింది. ఆ సాంగ్ రికార్డింగ్ లో అనిరుధ్ పాట పాడుతుండగా... డైరెక్టర్ త్రివిక్రమ్ కూర్చుని ఆ పాటను ఆలపిస్తున్నాడు. ఇక చివరిలో పవన్ కొంచెం కోపంగా చేతులు కట్టుకుని నిలబడే స్టిల్ చూసిన ఫాన్స్ ఆనందానికి అవధులే లేవు.  ఇక ఆ పాట 'బయటకొచ్చి చూస్తే టైమేమో త్రీ వో క్లాక్...' అంటూ సాగుతుంది. ఇక ఈపాటని వింటూ పవన్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పాటతోపాటే సినిమా విడుదల తేదీని కూడా ఆఫీషియల్ గా ప్రకటించింది చిత్ర యూనిట్.

పవన్ - త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న PSPK  25 చిత్రం 2018  జనవరి 10 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. మరి జనవరి 10 అంటే సంక్రాతి సీజన్ స్టార్టింగ్ అన్నమాట. అంటే సంక్రాంతికి వచ్చే చరణ్ సినిమా, మహేష్ సినిమా, ఇంకా ఈ లిస్ట్ అప్పటికి పెరిగే అవకాశం చాలానే వుంది. మరి పవన్ సినిమాని చూసి ఎవరైనా తగ్గుతారో లేకుంటే కుదరదు.. పోటీకి సై అంటారో చూద్దాం.

అయితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలకి దూరంగా ఉంటానని... ఐదుగురు ఉన్న కుటుంబం నుండి వచ్చిన తనని ఇన్ని కోట్లమంది ఉన్న కుటుంబంలో ఒకడిగా చూస్తున్న మీ ప్రేమ అభిమానానికి కృతజ్ఞతలు అంటూ ఫ్యాన్స్ కి థాంక్స్ చెప్పాడు పవన్.

Click Here to See The Video

Pawan Birthday Special PSPK25 Musical Surprise Released :

Mega Fans Happy with PSPK 25th film Musical Surprise 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs