Advertisement
Google Ads BL

అప్పుడే అఖిల్ హీరోయిన్ పై రూమర్స్..!


కళ్యాణి ప్రియదర్శన్ ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా వుంది కదా! అదేనండి అఖిల్ సెకండ్ మూవీ 'హలో' లో అఖిల్ పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు అఖిల్ మూవీ 'హలో' తో పరిచయం కాబోతున్న ఈ కళ్యాణి ప్రియదర్శన్ ఫెమస్ డైరెక్టర్  ప్రియదర్శన్-లిస్సి ల ముద్దుల పట్టి. ఈమె అఖిల్ సినిమాతోనే తెలుగులోకి డెబ్యూ హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. 'హలో' సినిమాని డైరెక్టర్ విక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ 'హలో' లో కేవలం అఖిల్ లుక్ ని మాత్రమే నీట్ గా రివీల్ చేశారు కానీ, కళ్యాణి ప్రియదర్శన్ లుక్ ని మాత్రం సరిగ్గా రివీల్ చెయ్యలేదు. 

Advertisement
CJ Advs

అఖిల్ విలన్స్ ని కొడుతూ కళ్యాణి ప్రియదర్శన్ ని ముద్దాడే పిక్ ని మాత్రం రివీల్ చేశారు. అందులో కళ్యాణి లుక్ క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఈ కళ్యాణి మీద ఒక న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే... మోహన్‌లాల్ కొడుకుతో కళ్యాణి ప్రియదర్శన్ లవ్ ఎఫైర్ నడుపుతుందని... కోలీవుడ్, మలయాళ మీడియా ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. కొన్ని రోజులుగా మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ -  కళ్యాణి కలిసున్న కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ రూమర్ స్ప్రెడ్ అవడానికి కారణం ఈ ఫోటోసే అంటున్నారు.

హీరోయిన్స్ మీద రూమర్స్ రావడం సహజమే... కొన్నిసార్లు వాళ్ళు ఫీల్ అయినా.. మరికొన్నిసార్లు లైట్ తీసుకుంటారు. కానీ కళ్యాణి అలా ఈ రూమర్ ని లైట్ తీసుకోకుండా సినిమా లవర్స్ కి ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమ కుటుంబంతో మోహన్‌లాల్ కుటుంబానికి ఎప్పటి నుండో రిలేషన్ వుందని.... ప్రణవ్ తనకు పెద్దన్నలాంటి వాడని చెప్పడమే కాదు... మా మధ్య వచ్చిన రూమర్స్ నిజంకాదని తేల్చేసింది. అయితే ప్రణవ్ చాలా సింపుల్‌గా వుంటాడని... అతను తనకి రోల్ మోడల్ అని మాత్రం చెబుతుంది. అయితే తెలుగులో నటించే 'హలో' ఇంకా విడుదల కాకముందే ఇలాంటి రూమర్స్ రావడం చూస్తుంటే ఈ అమ్మడు లో కాస్త విషయం వున్నట్లే తెలుస్తుంది.

Love Affair Rumors on Akhil Second Movie Heroine:

Love Affair Rumours Between Kalyani Priyadarsan and Mohan Lal son Pranav
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs