హింట్: అమలా.. ఆరబోతలో తగ్గే ప్రసక్తే లేదు!


డైరెక్టర్ విజయ్ తో అమల పాల్ ప్రేమ, పెళ్లి, విడాకుల వ్యవహారం తర్వాత సినిమాల్లో బాగా బిజీ అయ్యింది. పెళ్లి తర్వాత అమలకు అవకాశాలు తగ్గాయి. అవకాశాలు తగ్గడంతో పాటే భర్త విజయ్ తో వచ్చిన విభేదాల కారణంగా కోర్టుకెక్కి విడాకులు తెచ్చుకున్న అమల జీవితం ఇప్పుడు సాఫీగానే సాగిపోతుంది. చేతినిండా అవకాశాలతో అల్లుకుపోతూ ఫిట్ గా తయారవడానికి యోగా, జిమ్ లతో కుస్తీ పడుతూ తన ఫిజిక్ ని నాజూగ్గా తయారు చేసింది. అయితే అమల పాల్ తమిళంలో నటించిన తాజా చిత్రం 'విఐపి 2' ప్లాపుని మూటగట్టుకుంది. ఈ చిత్రంలో ధనుష్ కి భార్య గా అమల హోమ్లీ పాత్రలో మెరిపించింది. ధనుష్ హీరోగా బాలీవుడ్ నటి కాజోల్ విలన్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్లాపయినప్పటికీ  కలెక్షన్స్ పర్వాలేదనిపించాయి.

ఇక అమల పాల్ ఇప్పుడు తాజాగా హీరోలు ప్రసన్న, బాబీ సింహాలతో తో కలిసి 'తిరుత్తుపాయాలే 2' అనే తమిళ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో అమల పాల్ అందాలు మాములుగా ఆరబొయ్యడంలేదు. తాను గ్లామర్ షో చెయ్యడానికి ఏ మాత్రం వెనుకాడను అన్న చందంగా అమల అందాల ఆరబోత ఈ చిత్రం పోస్టర్స్  లో కనిపిస్తుంది. హీరో బాబీ సింహాతో కలిసి వర్షంలో తడుస్తున్న అమలని చూడగానే వావ్ ఎంత అందంగా వుంది అనిపించేలా వుంది అమలా పాల్. ఇక విడాకుల తర్వాత ఎక్కడన్నా గ్లామర్ పరంగా అమల తగ్గుతుంది అనుకున్నవాళ్ళకి ఈ చిత్రంతో  అదేం లేదు అన్నట్లుగా హింట్ ఇచ్చేస్తుంది. 

ఇకపోతే అమల చేతిలో ఇప్పుడు అరడజను సినిమాలు పైనే వున్నాయి. అందులో కొన్ని షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉండగా మరికొన్ని ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఇప్పుడు అమల పాల్ నటిస్తున్న 'తిరుత్తుపాయాలే 2 , భాస్కర్ ఓరు రాస్కేల్' చిత్రాలు రెండూ విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Amala Paul Hot Exposing in ThiruttuPayale 2 Tamil Movie:

Amala Paul ThiruttuPayale 2 Tamil Movie first Look Released. 
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES