Advertisement
Google Ads BL

'జై లవ కుశ'ని ఎన్టీఆర్ కెలికేస్తున్నాడంట!


'జై లవ కుశ' విడుదలకు సిద్దమవుతుంది. సెప్టెంబర్ 21 న సినిమా విడుదల అని రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. సినిమా విడుదలకు కేవలం 21 రోజులు మాత్రమే వుంది. ఇప్పటికే కన్ఫ్యూజన్ గా వున్న 'జై లవ కుశ' గురించి ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే డైరెక్టర్ బాబీ తీసిన 'జై లవ కుశ' ఫైనల్ అవుట్ ఫుట్ చూసిన ఎన్టీఆర్ సంతృప్తి చెందడంలేదంట. అందుకే 'జై లవ కుశ' ఎడిటింగ్ ని ఎన్టీఆర్ పర్యవేక్షణలోనే చేపిస్తున్నాడట. 

Advertisement
CJ Advs

ఎందుకంటే ఎన్టీఆర్ నటన, డాన్స్ లోనే కాదు ఒక స్టోరీ రైటర్ గా, డైరెక్టర్ గా అన్ని కళల్లో ప్రావీణ్యం ఉన్నవాడని చాలా మంది మొదటి నుండి  చెబుతూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు 'జై లవ కుశ' విషయంలో ఎన్టీఆర్ తన కళలను బయటికి తీస్తున్నాడని టాక్ వినబడుతుంది. టోటల్ గా 'జై లవ కుశ' సినిమా చూశాక సంతృప్తి పడని ఎన్టీఆర్ లూజ్ ఎండ్స్ వుంటే సరి చేసి, ఫస్ట్ హాఫ్ లాక్ చేసి ఇప్పటికే ఆర్ ఆర్ కు పంపించేసినట్లు సమాచారం అందుతుంది. ఇప్పడు సెకండాఫ్ విషయంలో కూడా ఎన్టీఆర్ ఆవిధమైన కేరే తీసుకుంటున్నాడట. రెండు మూడు రోజుల్లో సెకండ్ హాఫ్ ని కూడా ఫైనల్ చేసి లాక్ చేసి ఆర్ ఆర్ కి పంపుతారని చెబుతున్నారు.

ఇక 'జై లవకుశ' సినిమా చివర 15  నిముషాలు తారక్ తన నట విశ్వరూపం చూపించబోతున్నాడని చెబుతున్నారు. అయితే 'జై లవ కుశ' విడుదల డేట్ దగ్గర పడుతున్నా కానీ సిజి వర్క్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో పనులను ముక్కలు ముక్కలు గా చేసి, హైదరాబాద్ లోని  కొన్ని కంపెనీలకు ఇచ్చి, చకచకా పూర్తి చేయిస్తున్నట్లు తెలుస్తుంది. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'జై లవ కుశ' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎన్టీఆర్ వేలు పెట్టాకే సినిమా మీద కాన్ఫిడెన్స్ పెరిగిందని... ఈ చిత్రంతో తమ్ముడు మంచి హిట్ కొడతాడని.. అలాగే అన్నకళ్యాణ్ రామ్ కూడా నిర్మాతగా ఫుల్ శాటిస్ఫై అవుతాడంటున్నారు.  

NTR Hand in Jai Lava Kusa Technical Department:

Jr NTR Edits Jai Lava Kusa Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs