Advertisement
Google Ads BL

బాలకృష్ణ 'పైసా వసూల్' టాకేంటి..?


బాలకృష్ణ 'పైసా వసూల్' చిత్రం థియేటర్స్ లోకి వచ్చేసింది. సినిమా ఊర మాస్ లెక్క నందమూరి ఫ్యాన్స్ కి ఊపు తెచ్చేసిందనే టాక్ బయటికి వచ్చింది. థియేటర్స్ లో ఫ్యాన్స్ కుర్చీల్లో కూర్చోకుండా విజిల్స్, కేకలు పెడుతూ పండగ చేసేసుకుంటున్నారు. బాలయ్య ఫ్యాన్స్ థియేటర్స్ లో చేసే హంగామా మాములుగా లేదు. 'పైసా వసూల్' హిట్, సూపర్ హిట్ అంటూ తెగ గోల చేస్తున్నారు ఫ్యాన్స్. 'పైసా వసూల్' లో బాలకృష్ణ డైలాగులు, ఫైట్లూ అదరహో అనిపించేలా ఉన్నాయట. మూవీలో పూరీ మార్క్ పంచ్ డైలాగ్స్ భారీగానే పేలుతున్నాయంటున్నారు. 

Advertisement
CJ Advs

అసలు అలా అలా కథలోకి వెళితే కొంతమంది రౌడీలు బాలకృష్ణ ని టార్గెట్ చేసి వెంటాడుతుంటారు. కానీ వారి ప్రయత్నాలను తిప్పికొడుతూ తన లక్ష్యం వైపు వెళ్తుంటాడు. బాలయ్యకి సారిక (శ్రియస్) అనే బీబీసీ జర్నలిస్ట్ పరిచయం ఏర్పడుతుంది. సారికతో లవ్ లో పడతాడు. తన లక్ష్యం కోసం పోర్చుగల్ వెళ్లిన బాలయ్య అక్కడ సారిక సహాయంతో అనుకున్నది సాధిస్తాడు. అసలు బాలయ్య లక్ష్యం ఏమిటి? తేడా సింగ్ గా బాలయ్య ఎలా మారాడు? గ్యాంగులను ఎలా ఎదుర్కొన్నాడన్నది చెప్పేస్తే మజా ఏం ఉంటుంది. 

కాకపోతే ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ట్రాక్ లో ఉంటే.. సెకండ్ హాఫ్ మాత్రం స్పీడందుకుని.... పుంజుకుంటుందని రిపోర్ట్ అందుతుంది. అలాగే చివరి 20  నిమిషాలు సినిమా స్లో అయినప్పటికీ బాలయ్య పెరఫార్మెన్సు తో దాన్ని కవర్ చేశాడంటున్నారు. ఇకపోతే 'పైసా వసూల్' మొత్తం బాలయ్య యాక్షన్, పెరఫార్మెన్సు, హీరోయిన్స్ శ్రియ, ముస్కాన్, కైరా గ్లామర్, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అన్ని ఆకట్టుకునేలా ఉన్నాయంటున్నారు. మరి 'పైసా వసూల్' ఫ్యాన్స్ మూవీనా .. లేకుంటే ప్రేక్షకుల మూవీనా అనేది మాత్రం మరి కాసేపట్లో రివ్యూ లో తెలుసుకుందాం.

Balakrishna Paisa Vasool Movie Talk:

Balakrishna and Shriya starring Paisa Vasool Movie Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs