సినిమా వాళ్ళు ఇక్కడ (రాజకీయాల్లో) నిలవడం సాధ్యం కాదు. అది నేను రాసిస్తాను. మా సంగతి వేరు. మా బ్లడ్ వేరు. మా బ్రీడ్ వేరు. ఇది పైసా వసూల్ ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాలయ్య మాట్లాడిన మాటలు. సినిమా నటులు రాజకీయాల్లో రాణించడం అనేది ఒక్క ఎన్టీఆర్ విషయంలోనే చెల్లుపాటు అయ్యింది. ఇంకెవరి వల్ల కాదు. మేము తప్ప మరే సినీ కుటుంబం కూడా రాజకీయాల్లో సక్సెస్ కాలేదని, కాదని.. బాలయ్య చెప్పాడు.
మరి తన అన్నయ్య హరికృష్ణ ది కూడా బాలకృష్ణ రక్తమే గా. అదే నందమూరి రక్తమేగా. హరికృష్ణ కూడా పోటీ చేశాడు. అంతే కాదు పార్టీ కూడా పెట్టాడు అన్న టీడీపీ అని. ఏమైంది ఒక్క సీట్ కూడా రాలేదు. మా బ్లడ్, మా బ్రీడ్ అని ఎగిరిన బాలయ్య, మరి హరికృష్ణ ది ఏ బ్లేడ్డో, ఏ బ్రీడో చెబితే బావుంటుంది. రాజశేఖర్ రెడ్డి వున్నప్పుడు సుమారు 10 సంవత్సరాలు సోదిలోకి కూడా రాని టైమ్ లో బాలయ్య బ్లడ్, బ్రీడ్ ఏం చేశాయో చెబితే బావుంటుంది.