Advertisement
Google Ads BL

అను.. రెండువైపులా రెచ్చిపోతుంది!


'మజ్ను' చిత్రంతో మెల్లగా టాలీవుడ్ లోకి వచ్చిన అను ఇమ్మాన్యువల్ ఆ చిత్రంలో నానికి జోడిగా నటించింది. అయితే 'మజ్ను' చిత్రం మిక్స్డ్ టాక్ తో అనుకి పెద్దగా పేరులేకుండా పోయింది. అసలు ఆ చిత్రంలో నటించిన అను ఇమ్మాన్యువల్ అంటే సాధారణంగా టాలీవుడ్ లోకి వచ్చి పోయే హీరోయిన్స్ మాదిరిగానే జమకట్టారు. ఆ తర్వాత రాజ్ తరుణ్ మూవీ 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'లో నటించిన అను కి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ వంటి స్టార్ పక్కన సెకండ్ హీరోయిన్ గా చేసే అవకాశం రావడంతో అందరి చూపు అను మీద పడింది. మరి పవన్ పక్కన చిన్న కేరెక్టర్ చేసిన గ్రేట్ అనుకునేవారు చాలామందే ఉన్నారు. 

Advertisement
CJ Advs

ఇక అను, పవన్ కళ్యాణ్ పక్కన ఎంతసేపు ఉంటుందో... ఆమె కేరెక్టర్ ఏంటో తెలియకుండానే... అల్లు అర్జున్ - వక్కంతం వంశి కాంబోలో తెరకెక్కుతున్న 'నా పేరు సూర్య' లో హీరోయిన్ గా ఎంపిక చేశారు. మరి ఒక్కసారిగా ఇంతటి అదృష్టం రావడం అంటే మామూలు విషయం కాదు. 'మజ్ను' సినిమాలో లంగావోణి, చుడీదార్స్ లో హోమ్లీగా కనబడిన ఈ భామ, గోపీచంద్ ఆక్సిజన్ చిత్రం లో మంచి గ్లామర్ రోల్ తో రెచ్చిపోనుంది. అటు గ్లామర్, ఇటు నటన..రెండింటితో అను, స్టార్స్ ని బుట్టలో వేసుకుంటుంది.  ఆమె నటిస్తున్న సినిమాలు ఇంకా సెట్స్ మీద ఉండగానే అను ఇమ్మాన్యువల్ మాత్రం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ ఇండియాలో హల్చల్ చేస్తుంది. ఇప్పటికే తన వైపు చూస్తున్న దర్శక నిర్మాతల చూపు తన మీద స్ట్రాంగ్ గా ఫిక్స్ అవ్వాలంటే ఈ మాత్రం గ్లామర్ చూపించడం కరెక్ట్ అనే రీతిలో రెచ్చిపోతూ అమ్మడు ఫొటోస్ షూట్స్ తో చంపేస్తుంది.

అయితే పవన్ తో చేస్తున్న చిత్రంలో అను ఇమ్మాన్యువల్ నటనకు ఫిదా అయిన ఆ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ తో చెయ్యబోయే మూవీలో కూడా అను నే హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయం అధికారింగా బయటికి రావాల్సి ఉంది. అయితే అను ఇమ్మాన్యువల్ మాత్రం తన అదృష్టానికి ఒక పక్క మురిసిపోతూనే... మరోపక్క ఇండస్ట్రీలో పది కాలాలు నిలవాలంటే అందచందాలు కూడా భారీగా ఆర బొయ్యాలనే ఆలోచనకే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టు ఉంది. అందుకే ఈ పిక్ లో రెచ్చిపోతుంది.

Anu Emmanuel Sensational Heroine:

Anu Emmanuel gets Big Projects
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs