Advertisement
Google Ads BL

అర్జున్ రెడ్డి దమ్ముంటే వీటికి సమాధానం చెప్పు?


అర్జున్ రెడ్డి కుమ్మేసింది, చంపేసింది అని సినిమా చూసిన ప్రతి ఒక్కరు పొగుడుతున్నారు. అర్జున్ రెడ్డి ని అభిమానించినవాళ్ళకి ఈ ప్రశ్నలు అంటూ సోషల్ మీడియా లో ఓ యువతి ఈ క్వశ్చన్స్ ని సంధించింది! దమ్ముంటే ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పగలరా..!

Advertisement
CJ Advs

1. అర్జున్ రెడ్డి నుండి మనం ఏం నేర్చుకోవాలంటారు? వాడిలా ఉండాలనా? వద్దనా?

2. భగ్నప్రేమికుడై తాగి తందనాలాడి, బూతులు మాట్లాడి, ప్యాంట్ లో ఐసుగడ్డలేసుకుని, కనిపించిన ఆడదాన్ని నా ఫిజికల్ నీడ్ కి హెల్ప్ చేస్తావా అని అడుగుతూ, తనే ఎంతో ఇష్టపడిన డాక్టరు వృత్తికి ద్రోహం చేస్తూ, తనకి ఎంతో సపోర్ట్ చేస్తున్న ఇటు కుటుంబానికి, అటు స్నేహితులకు, నాలాంటి కొందరు ప్రేక్షకులకు పెద్ద తలనొప్పిలా తయారయిన అర్జున్ రెడ్డి గొప్ప ప్రేమికుడా? లేదా ప్రాణంగా ప్రేమించినవాడు మూర్ఖంగా వదిలేసి వెళ్ళిపొతే, తల్లిదండ్రులకు జరిగిన అవమానానికి తల వంచుకుని వేరే ఎవడి చేతో తాళి కట్టించుకుని, వాడిని భరించలేక పెళ్ళైన మూడో రోజే బయటికొచ్చేసి తన వృత్తికి న్యాయం చేస్తూ ఒక క్లినిక్ లో జాయిన్ అయి వైద్యం చేస్తూ, తను తల్లి కాబోతోందని తెలిసి ధైర్యంగా నిలబడి, ఎవ్వరి సహాయమూ లేకుండా ఒక్కర్తే బాధ్యతగా తన జీవితాన్ని జాగ్రత్తగా నెట్టుకొస్తున్న ప్రీతి గొప్ప ప్రేమికురాలా?

3. కన్నతండ్రి ఎదురుగా నిలబడి 'నేను, ఆ అమ్మాయి ముద్దుపెట్టుకుంటుంటే వాళ్ళ నాన్న చూసాడు' అని చెప్పలేక ప్రైవేటు స్పేసు, మీకు పెళ్ళైనప్పుడు 23, నాకిప్పుడు 27 అంటూ డొంక తిరుగుడు మాటలు చెప్పే అర్జున్ రెడ్డి bold ఆ? కన్న తల్లిదండ్రి, అక్క ఎదుట ధైర్యంగా కూర్చుని, వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ 'నేను వాడు వందల సార్లు సెక్స్ లో పాల్గొన్నాం' అని చెప్పిన ప్రీతి bold ఆ?

4. ప్రీతి వాళ్ళ తమ్ముడు 'అర్జున్..' వాట్? అని అడిగితే కోపంతో 'మిథున్, బెహేవ్' అని అరిచిన ప్రీతి progressive ఆ? లేక లాస్ట్ లో కడుపుతో ఉన్న ప్రీతి ని ఇంటికి తీసుకొస్తే అనుమాన చుపులు చూసిన అన్నని, బుద్ధి లేదురా వెధవా, ఏమిటా చూపులు? అని అడగకుండా, ఇది నా బిడ్డే అని గొప్పగా చెప్పిన అర్జున్ రెడ్డి progressive ఆ?

5. ఎయిర్ హోస్టెస్ ని ఏదో అన్నాడని women ని objectify చెయ్యడం తప్పు అని నీతులు మాట్లాడే అర్జున్ రెడ్డి, మెడికల్ కాలేజీలో లావుపాటి అమ్మాయిల గురించి మాట్లాడింది ఏమిటో??

6. PMS టైము లో అమ్మాయిలను అర్థం చేసుకుని సున్నితంగా చూసుకోవాలి అని సుద్దులు చెప్పిన అర్జున రెడ్డి, తాగుతున్న తనని చూస్తున్న స్టాఫ్ నర్స్ ను ప్యాంట్ ఇప్పి '...' చేస్తా అన్నట్టు బెదిరించిన అర్జున రెడ్డి gen X వాడా?

7. సినిమా రియలిస్టిక్ గా ఉండడం అంటే మన నిజ జీవితానికి దగ్గరగా ఉన్న కథలు, పాత్రలు, సంభాషణలు ఉండడమే కదా! అర్జున్ రెడ్డి లాంటి rich, pervert, irresponsible kids మన చుట్టూ ఎంతమంది ఉన్నారంటారు?

8. ఈ సినిమా ఎవ్వరికీ sexist అని ఎందుకు అనిపించలేదు?

most irresponsible, most male chauvnistic and most sexist dialoge of the movie .... పిల్లల్ని ప్లాన్ చేసి కనడం ఏమిట్రా, అది జరగాలి, out of love జరగాలి. అవును, హీరోయిన్ ని 23 యేళ్ళ కి గర్భవతిని చెయ్యడం out of love. is it? condoms వాడకుండా కలిస్తే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది అని ఇద్దరు డాక్టర్లకి తెలియకపోవడం out of love. is it? ఆడదాన్ని ఇసుమంత కూడా లెక్క చెయ్యకుండా, ఇసుమంత కూడా గౌరవం, విలువ ఇవ్వకుండా, నేను, నా ప్రేమ మాత్రమేనాకు ముఖ్యం అనుకుంటూ పిల్లల్ని కనడం, వాళ్ళని పెంచడం ఎంత పెద్ద బాధ్యతో, ముఖ్యంగా ఆడవాళ్ళకి శారీరకంగా, మానసికంగా ఎంత కష్టం, ఎంత శ్రమ, ఎంత బాధ్యత అనేది గుర్తించలేనివాడే అలాంటి డైలాగ్ కొట్టగలడు. వీడేమో ఆడవాళ్ళ PMS టైము ని అర్థం చేసేసుకుంటాడట!! nonsense. 

పక్క మీదకు చేరని ప్రేమ, ప్రేమే కాదంటాడు చలం. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపొతే ఇదిగో ఇలా అర్జున్ రెడ్డిలా తయారవుతారు. 

9. అప్పుడే కాలేజీలో జాయిన్ అయిన పిల్లకి కనీసం ఒక్క మాట చెప్పకుండా ముద్దు పెట్టుకుని, ఒళ్ళో పడుకుని అదంతా ప్రేమ అని అపోహపడి అది నా పిల్ల నా పిల్ల అని తిరిగే వాడికి ఆడవాళ్ళంటే గౌరవం ఉన్నట్టా? అసలు ప్రీతి ని చూడగానే అర్జున్ రెడ్డి కి కలిగిన ఫీలింగ్ ఏమిటి? ముద్దుపెట్టుకోవాలనిపించింది. అదే చేసాడు. అదేనా గొప్ప ప్రేమ అంటే?

10. అసలు, అంత జడ్డి దద్దమ్మలా నోరైనా తెరవకుండా వాడు ఏం చెప్తే అది చేస్తూ, చేయించుకుంటూ ఉండే పిల్లని ఎవరైనా ప్రేమించగలరా? ఆది సినిమాలో 'మా ఇంట్లో ఆడవాళ్ళకు, బయటికొచ్చి మాట్లాడే అలవాటు లేదు' అంటాడు. ఆది కి కూడా హీరోయిన్ అంటే అమితమైన ప్రేమ, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. అర్జున్ రెడ్డి కూడా అంతే. తనకిష్టమైతే చాలు, ఆ పిల్లకి ఏమి ఇష్టాలో కావో అక్కర్లేదు. ఆది కి, అర్జున్ రెడ్డి కి తేడా ఏమిటి?

అలాంటివాడే నాకెదురైతేనా చావగొట్టి చెవులు మూస్తాను. కష్టపడి చదివి, ర్యాంకు సంపాదించి, కుటుంబానికి దూరంగా ఉంటూ అక్కడికొచ్చింది అనుభవజ్ఞులైనా వాళ్ళు పాఠాలు చెబితే నేర్చుకుందామని, నీలా కోన్ కిస్కా గొట్టం గాడు వచ్చి నా చేతులు ముట్టుకుని వాటి మీద గీతలు గీసి పాఠాలు చెబుతానంటే మక్కెలిరగదంతాను. 

10. ఆ పిల్ల...ఏం చూసి ప్రేమించింది వాడిని? తన అభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండా దౌర్జన్యం చేస్తున్నవాడు ఐజక్ న్యూటన్ అయినా కానీ నాకు అక్కర్లేదు అని దుళ్ళగొట్టకుండా వాడితో ప్రేమేమిటి? హోళీ రంగులు పూసినవాడిని తన్నినందుకా? ఓసోస్, ఇంతోటి గొప్ప సీను ఎన్ని సినిమాల్లో చూడలేదూ!! హీరోయిన్ వైపు చూస్తే చాలు, ఎముకలు పొడి చేసే హీరోలేగా తెలుగు నిండా!!  సినిమా ఏమిటి, ప్రతీ హోలీ కి బయట ప్రపంచంలో జరిగేది అదే. ఇంట్లోవాళ్ళకు, బాయ్ ఫ్రెండులకు కోపాలు వచ్చేది ఇలాగే. ఏదో సినిమాటిక్ గా అర్జున్ రెడ్డి ప్రేమలో నిజాయితీగా ఉన్నాడు కానీ అదే ఒక హౌలాగాడయ్యుంటే ఆ పిల్ల పరిస్థితి ఏమిటి? రియలిస్టిక్ గా ఉండడమంటే వాడితో సీనుకో ముద్దు, రెండు సీన్లకోసారి సెక్సు నా?

11. ఒక్కచూపుతో ప్రేమలో పడిపొయే జాఢ్యం మనకింక పోదా? కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే ప్రేమ పుట్టే రోగం మనల్ని వదలదా? అసలు అలా ప్రేమలో పడేవాళ్ళు ఒకరికొకరు అలవాటైపోవచ్చు తప్పితే నిజంగా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ బతకగలరా? అది నిజమైనా ప్రేమేనా?  how different this movie from other mass masala movies in this aspect? 

12. హీరోయిన్ తండ్రి, అర్జున్ రెడ్డి ని నాలుగేళ్ళ క్రితం, కూతురు కాలేజీలో జాయిన్ అయినప్పుడు చూసాడు. మళ్ళీ ఇప్పుడు తన ఇంటి డాబా మీద కూతురిని గాఢంగా ముద్దుపెట్టుకుంటూ. 

ఒక కన్నతండ్రికి అదెలా ఉంటుంది? ఒళ్ళు భగభగమండిపోయిందంటే, మండదూ?!! ఈ వీర ప్రేమికులని ఆ తండ్రి జడ్జి చెయ్యకుండా ఉండాలా? 'సాధారణంగా ఒకరికోసం ఒకరు పుట్టారు అనుకుంటారు అందరూ, కానీ  నేను మన తల్లిదండ్రులు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ వాళ్ల పేరెంట్స్ అందరూ మనకొసమే పుట్టారు. so that they make babies in each generation and we both get to meet in this generation' అని చెప్పే అర్జున్ రెడ్డి కి ఎదురుగుండా నిల్చున్న హీరోయిన్ తండ్రి కోపంలో న్యాయం కనిపించలేదూ? గౌరవించడం, సంస్కారంగా మాట్లాడడం తెలీలేదూ?? 

13. కలిసిన గంటలోనే, న్యాయమైన కోపాన్ని ప్రదర్శించే హీరోయిన్ తండ్రిని 'వాడు మూర్ఖుడు, castist' అనే అర్జున్ రెడ్డి కి, 'దేవదాస్' సినిమాలో మామని నానామాటలు అనే హీరో కి తేడా ఏమిటి? నిన్ను కోరి రివ్యూ రాస్తున్నప్పుడు ఇదే మాట చెప్పాను...కాబోయే మావయ్య ని పట్టుకుని అరేయ్, ఒరేయ్ అనకుండా అతని మాటలకి గౌరవం ఇచ్చే హీరో...he stands alone అని చెప్పాను. మరి అర్జున్ రెడ్డి ఏం చేసాడు? how unsual Arjun reddy in telugu cinema? what is the difference between Arjun Reddy and Devadas?

14. వాడికి ఎంతసేపు వాడి స్వార్థం, వాడి ప్రేమ, వాడి ఇగో తప్ప ఇంకేమైనా తెలుసా? ఇలాంటి మనిషి మీ నిజ జీవితాల్లో కనిపిస్తే ఎవరైనా భరించగలరా? ముఖ్యంగా ఆడపిల్లలు భరించగలరా? గొప్ప ప్రేమికుడని భావించగలరా?

15. అర్జున్ రెడ్డి కి ఫిజికల్ నీడ్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు తన దగ్గరకి వచ్చిన ఆడవాళ్లకు తన కథ ఎందుకు చెప్తున్నట్టు? హీరోయిన్ జియా తో అంత నిక్కచ్చిగా నా ఫిజికల్ నీడ్ కి హెల్ప్ చెయ్యి, నాకు emotional connect వద్దు అని చెప్పినప్పుడు, రోజూ ఆ పిల్లని కలిసి గంటలు గంటలు మాట్లాడడం ఎందుకు? ఆ పిల్లకి తన కథ చెప్పడం ఎందుకు? emotional connect వద్దు అంటూనే వాళ్ళందరికీ తన కథ చెప్పి emotional గా connect చెయ్యడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నట్టు? 

16. ప్రపంచంలో ఆడవాళ్ళందరూ వీడంటే పడి చచ్చిపొతారా!!, హాస్పిటల్ లో పేషంట్లు, నర్సులూ వాడి కోసం దేబిరిస్తూ ఉంటారా!! ప్యాంటు, షర్టు ఇప్పి డ్రాయరు తో అమీర్ పేట సెంటర్ లో నిలబడితే వీడి కోసం ఆడవాళ్ళు క్యూ లు కట్టి నిల్చుంటారా!! how sexist, that comment was!! Damn...what a male chauvnistic thinking!! How different this movie from other commercial movies, in this aspect?!! I fail to understand what made people to think this is different and realistic movie!!!!!!!

17. భావోద్వేగాలు దాచుకోకుండా ప్రదర్శించిన పచ్చి సినిమా నా? అంటే ప్యాంటు లో ఉచ్చపోసుకోవడమా?! లేదా ప్యాంటు లో ఐసుముక్కలేసుకోవడమా? తన బాగు కోసం తపించిపోతున్న అన్న ని, స్నేహితులను నానామాటలు అంటూ ఉండడమా?

18. తన వృత్తిని ప్రాణంగా ప్రేమిస్తాడా? అసలు తాగి హాస్ఫిటల్ కి వచ్చే డాక్టరు ని ఎవడురా రానిచ్చేది నిజ జీవితంలో? ఆపరేషన్లు successful గా చేసేస్తే తాగొచ్చినా పర్లేదా? కోర్ట్ సీనులో, పేషెంట్, తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసాను కాబట్టి I am guilty అని ఒప్పుకున్న మనిషి ఆ చిట్టచివరిలోనే అది గ్రహించాడా? వాడు తాగొచ్చి చేసిన మొదటి ఆపరేషన్ లో నే పేషెంట్ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ఏ పేషెంట్ కూడా తెలిసి తెలిసి డ్రగ్ అడిక్ట్ డాక్టరు చేత ఆపరేషన్ చేయించుకోడు. అన్నిచోట్ల చాలా నిజాయితీగా ఉంటాననుకుని ఫీల్ అయిపోయే డాక్టరు తన పేషెంట్ల దగ్గర నిజాయితీగా ఉన్నాడా? ఆపరేషన్ చేసేముందు పేషెంట్ కి చెప్పాడా తనే పరిస్థితుల్లో ఉన్నాడో?!! ద్రోహం చివర్లో మాత్రమే చేసాడా?!! 

19. ఈ పిల్ల ప్రేమ పిచ్చిలో పడకపోతే న్యూరో crack చేసేవాడిని. టైము వేస్ట్ చెయ్యకుండా MS చెయ్యరా, జస్ట్ MBBS తో ఏమి సాధిస్తావురా?, మనం చెయ్యాల్సింది ఎంతో ఉంది అని స్నేహితుడికి చెప్పే అర్జున్ రెడ్డి, ఇదొక phase నన్ను వదిలేయండి అని తెలుసుకోగలిగే జ్ఞానం ఉన్న అర్జున రెడ్డి, తన జీవితంలో తనకి అత్యంత ఇష్టమైనది ఈ వైద్య వృత్తి అని చెప్పే అర్జున రెడ్డి లాంటివాళ్ళు ఈ సమాజానికి ఎంత ప్రమాదకరమో తెలుసా? చదువుకున్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళతోనే ఈ ప్రపంచానికి ప్రమాదం. చదువు, తెలివి లేనివాళ్ళు పీకేది ఏమీ లేదు. ఈ ప్రపంచాన్ని నిలబెట్టాలన్నా, పడదోయాలన్నా తెలివైనవాళ్ళే చెయ్యగలరు, చేస్తారు. మిగతా మాస్ మసాల కమర్షియల్ సినిమాలతో ఈ సమాజానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ అర్జున్ రెడ్డి లాంటి భాధ్యతారహితమైన సినిమా ని రియలిస్టిక్ అని మొయ్యడం వల్ల ఈ సమాజానికి చాలా ప్రమాదం పొంచి ఉంది.

20. ఇంక, చిట్టచివరి 'పవిత్రత' ముసుగు. all is well that ends well అని ఒక సామెత. if something doesn't end well, then nothing has been well అని దాని పరమార్థం. ఈ సినిమా కి సరిగ్గా సరిపోతుంది.  చివరిలో, హీరోయిన్ కి దూరం గా నిల్చుని నీతో మాట్లాడాలి ఒక్కసారి నా మాట విను అని బ్రతిమిలాడే అర్జున్ రెడ్డి కి, మొదటి సీనులో ఆ పిల్ల తో ప్రేమలో పడినప్పుడు కూడా ఇలాగే అడగాలి అని తెలియలేదూ?!! ఎంత నానాగడ్డి కరిచినా, ఎవ్వరితోనూ పడుకోలేదు, పవిత్రంగా ఉన్నాడట!!!! 27 యేళ్ళకి sex అవసరాలు ఉంటాయి అని గ్రహించగలిగే డాక్టర్ అర్జున్ రెడ్డి, M.S కి అదే 27 కి తన కుటుంబం పట్ల, సమాజం పట్ల బాధ్యతలుంటాయి అని తెలియకపోవడం రియలిస్టిక్, is it? Gen X movies. is it? దేవదాసు లా చస్తే, ఇలా ఉండకూడదు అని నేర్చుకుంటాం. పోనీ చివర్లో హీరోయిన్ వాడిని తన్ని తగిలేస్తే logical extension అనుకుంటాం. రెండూ కాదు. వాడిని హీరోని చేసి వదిలిపెట్టారు. పవిత్రం గా ప్రేమించుకునే రెండు పవిత్ర హృదయాల శారీరపు కలయిక, అదీ బీచ్ ఒడ్డున...వాహ్! వాహ్! 

ఫైనల్ గా, బాగా డబ్బున్న కుటుంబం, హాలిడేకి ఇటలీ పంపగలిగే తండ్రి, ఎప్పుడూ సపోర్ట్ గా ఉండే అన్న ఉన్న ఒక rich, perverted, irresponsible brute కథ ఈ అర్జున్ రెడ్డి.

one final last question. ఇదే కథ ని అమ్మాయి తరుపునుండి చెప్తే ఎంతమంది దీన్ని గొప్ప సినిమా అంటారు? అలా చెప్పిన (ఇంత ఘోరంగా కాదు) 'మైదానం' కథ ని ఇప్పటికీ తిడుతున్నారు జనాలు. అర్జున్ రెడ్డి మాత్రం Gen X movie. is it?

P.S: ఈ సినిమా ని ఆహా ఓహో అంటూ పొగుడుతున్నవాళ్ళ మీద ఎక్కువ కోపంగా ఉంది నాకు. వీళ్ళలో నేను గౌరవించేవాళ్ళు, అభిమానించేవాళ్ళే ఎక్కువ. అసలెలా నచ్చిందండీ మీకు? అని నిలదీసి అభిమానం తో కూడిన కోపం తో అడగాలనుంది.

Lady attack on Arjun Reddy:

One Lady Questions on Arjun Reddy Movie Content 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs