Advertisement
Google Ads BL

నాగ్, చైతూ-సామ్ ల పెళ్లి గిఫ్ట్ అదిరిపోలా..!


నాగ చైతన్య లవ్ లో పడ్డాడని.. అదీ హీరోయిన్ సమంతతో అని తెలిసినప్పటినుండే అక్కినేని ఫ్యామిలీ... వాళ్ళ ప్రేమని యాక్సెప్ట్ చెయ్యడమే కాదు తమ సమక్షంలోనే ఎంగేజ్మెంట్ చెయ్యడం అలాగే పెళ్లి  ప్లేస్ ఫిక్స్ చేయడం కూడా జరిగిపోయాయి. నాగ చైతన్య - సమంత ల ప్రేమ విషయం తెలిసినప్పటినుండి అక్కినేని ఫ్యామిలీ మీద మీడియా డేగ కన్నేసింది. అక్కినేని కుటుంబానికి సంబందించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు చేరవేసే పనిలో నిమగ్నమైంది కూడా. అయితే చై - సామ్ ల పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా.. ఎప్పుడెప్పుడు అక్కినేని కోడలిగా అడుగుపెడుతుందా? అని ఒక్క అక్కినేని అభిమానులు మాత్రమే ఎదురు చూడడంలేదు. నాగార్జునతో పాటే అక్కినేని ఫ్యామిలీ అంతా కూడా తెగ ఎదురు చూస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇక సమంత కూడా అక్కినేని ఇంటి కోడలిగా ఎప్పుడెప్పుడు కాలు పెడదామా అని ఎదురు చూస్తుంది కూడా. అయితే ఆ క్షణం ఎంతో దూరంలో లేదు. అక్టోబర్ 6 న గోవాలో హిందూ, క్రిష్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో చైతు, సమంతల పెళ్లి జరగబోతుంది. అయితే ఈ పెళ్లి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరగబోతున్నట్టు నాగార్జున చెప్పేశాడు. అయితే పెళ్లి డెసిషన్ చైతు, సామ్ లకే వదిలేసిన నాగ్ రిసెప్షన్ ని మాత్రం తన సమక్షంలోనే జరిపిస్తానని చెప్పాడు. అయితే అంగరంగ వైభవంగా జరగనున్న చైతు - సామ్ ల పెళ్లికి నాగార్జున నుండి అదిరిపోయే గిఫ్ట్ ని చైతు జంట అందుకోబోతుందట. 

అయితే నాగార్జున ఇచ్చే గిఫ్ట్ మాత్రం ఆ జంటకి చాలా సర్ప్రైజ్ అంట. ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడానికి నాగ్ అప్పుడే పనులు స్టార్ట్ చేసేశాడట. అయితే నాగ్ ఇవ్వబోయే గిఫ్ట్ ఏమిటా అని అందరూ ఎదురు చూస్తున్నారు కదా..! నాగార్జున అక్కినేని.. అన్నపూర్ణ స్టూడియోలో ఒక మంచి కాటేజ్ ని కట్టించి ఆ  కొత్త జంటకి కానుకగా ఇవ్వనున్నాడట. ప్రస్తుతం దాని పనులు చురుగ్గా జరుగుతున్నాయని.. అలాగే దాని కోసం అతి ఖరీదైన మెటీరియల్ వాడుతున్నారట. కానీ ఆ కాటేజ్ నాగ చైతన్య - సమంత లు ఎప్పుడూ ఉండేందుకు కాదట. కేవలం షూటింగ్స్ టైమ్ లో చైతు, సామ్ లు అక్కడ ఉండడానికి మాత్రమే నాగ్ ప్లాన్ చేసి మరీ దీన్ని కట్టిస్తున్నాడట.  మరి నాగ్ ఇవ్వబోయే ఆ కాటేజీ సర్ప్రైజ్ గిఫ్ట్ కొత్త జంటకి ఎంతబాగా నచ్చుతుందో చూడాలి. 

Nag Surprise Gift for Naga Chaitanya And Samantha:

Nagarjuna, on the occasion of Chai-Sam marriage, going to surprise his son by presenting a cottage in Annapurna Studio.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs