Advertisement
Google Ads BL

స్కూల్లో కూడా..!! తప్పు పిల్లలదా.. టీచర్స్‌దా..?


సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ జరిగిన విషయమైన క్షణాల్లో సోషల్‌ మీడియాలో ఫోటోలు, వీడియోలు వస్తున్నాయి. ఇక దేశంలో నిర్భయ, అభయ కేసుల తర్వాత మైనర్లు అంటే ఎవరు? అనే దానిపై కూడా బాగా చర్చ జరుగుతోంది. అశ్లీలంగా ప్రవర్తించడాలు, మానభంగాలు, శృంగార నృత్యాలు చేస్తున్నది ఎక్కువగా మైనర్లే కావడంతో వీరికి శిక్ష వేయాలా? వద్దా? అనేది కూడా చర్యనీయాంశం అవుతోంది. 

Advertisement
CJ Advs

ఇక పిల్లలు తమ స్కూళ్లలో ఏమి చేస్తున్నారో చూడాల్సిన ఉపాధ్యాయులు ఆ విషయాలను పట్టించుకోవడం లేదు. దీంతో విద్యార్ధులు కూడా టీవీలో వచ్చే షోలు, సినిమాల వల్ల శృంగార తరహా ఆటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో శృంగార భరితమైన, అశ్లీల నృత్యాలు చేస్తూ పలువురు కెమెరా కంటికి చిక్కారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి నృత్యాలను ప్రాక్టీస్‌ చేస్తుంటే అడ్డుకోవాల్సిన ఉపాధ్యాయులు వారిని మరింతగా ప్రోత్సహించడం పలు విమర్శలకు తావిస్తోంది. 

విద్యార్ధులు ఇంట్లో కంటే స్కూళ్లలోనే ఎక్కువ సమయం గడిపే రోజులివి. కాబట్టి ఉపాధ్యాయులకు పాఠాలు చెప్పడమే కాదు.... వారికి మంచి చెడులు చెప్పాల్సిన బాధ్యత కూడా ఎంతో ఉంది. తమిళనాడు రాష్ట్రంలోని అరియాలూరు జిల్లా జయం కొండాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అక్కడి పిల్లలు డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలో 'తమిళ బండిట్‌' చిత్రంలోని పాట బ్యాగ్రౌండ్‌లో స్పష్టంగా వినిపిస్తోంది. కొందరు విద్యార్ధులు చేతుల్లో తుపాకులను పట్టుకుని చుట్టూ నిలిచి ఉంటే, మహిళ వేషంలో ఉన్న విద్యార్ధి కింద పడుకుని ఉన్నాడు. అతనిపై ఓ విద్యార్ధి పండుకుని, రేప్‌ చేసినట్లుగా ప్రవర్తించడం ఈ వీడియాలో కనిపిస్తోంది. 

ఈ దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. ఫేస్‌బుక్‌, వాట్సప్‌లలో విపరీతంగా షేర్‌ అవుతోన్న ఈ వీడియో తమిళనాడు బాలల హక్కుల పర్యవేక్షణా సంస్థ దృష్టికి వెళ్లింది. దీనిని లైంగిక ప్రేరేపిత చర్యగా పరిగణించిన ఆ సంస్థ, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఉపాధ్యాయులు అక్కడే ఉండి మరీ ఆపకపోవడంతో వారిపై కూడా కేసు నమోదు చేశారు. 

Students Song Practice Video Sensation:

Ariyalur, Jayankondam School Children Practice Tamil Bandit Song for Independence day 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs